AP EDCET Counselling 2026 : ఏపీ ఎడ్‌సెట్ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈ నెల 29 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం!

AP EDCET Counselling 2026 Schedule : ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 29 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 12న సీట్ల కేటాయింపు జరగనుంది.

Published on: Sep 22, 2026, 10:08:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EDCET Counselling 2026 Schedule : రాష్ట్రంలో బి.ఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. ఏపీ ఎడ్‌సెట్ - 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ edcet కౌన్సిలింగ్
ఏపీ edcet కౌన్సిలింగ్

ఏపీ ఎడ్‌సెట్ - కౌ న్సెలింగ్ ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఈ నెల 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.
  • సర్టిఫికేట్ పరిశీలన: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్ధతిలోనే ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
  • వెబ్ ఐచ్ఛికాల (వెబ్ ఆప్షన్ల) నమోదు: అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమకు కావలసిన కళాశాలలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • సీట్ల కేటాయింపు: అభ్యర్థులు ఎంచుకున్న ఐచ్ఛికాలు, సాధించిన ర్యాంకు ఆధారంగా అక్టోబర్ 12న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

ఈ ఏడాది నిర్వహించిన ఎడ్‌సెట్ పరీక్షల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,880 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవగా, వారిలో ఏకంగా 19,741 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దీనితో ఈ ఏడాది ఎడ్‌సెట్‌లో రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా….

  • మొదటగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EDCET ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న 'Results' లేదా 'Download Rank Card' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నిర్ణీత ఖాళీల్లో నమోదు చేయండి.
  • వివరాలు సబ్‌మిట్ చేయగానే మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
  • కౌన్సెలింగ్ మరియు తదుపరి ప్రవేశాల అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More