...
...
Next Story

AP EdCET Hall Ticket 2026 : ఏపీ ఎడ్‌సెట్‌ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP EdCET 2026 Hall Ticket : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EdCET 2026 హాల్ టికెట్ల విడుదలయ్యాయి. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: Apr 24, 2026 07:51 PM IST
Advertisement

రాష్ట్రంలోని వివిధ విద్యా కళాశాలల్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) మరియు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఏపీ ఎడ్‌సెట్ 2026' (AP EdCET 2026)కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

ఏపీ ఎడ్‌సెట్‌ హాల్ టికెట్లు విడుదల
ఏపీ ఎడ్‌సెట్‌ హాల్ టికెట్లు విడుదల

ఏపీ ఎడ్ సెట్ పరీక్ష ఆధారంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది పరీక్షను చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

AP EdCET 2026 హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా

  • అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించండి.
  • హోమ్ పేజీలోని 'Download Hall Ticket' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

ఒకవేళ హాల్ టికెట్‌లో ఏవైనా తప్పులు ఉంటే, వెంటనే సంబంధిత కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించి వాటిని సరిదిద్దుకోవాలి. లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలో ఇబ్బందులుంటాయి.

ఏపీ ఎడ్‌సెట్‌ 2026 ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది.పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది.పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు ఉంటుంది. ఫలితాల ప్రకటన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారవుతుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.

  • ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష తేదీ - 04-05-2026.
  • ప్రిలిమినరీ కీ విడుదల: 07-05-2026.
  • ఎడ్ సెట్ ఫలితాలు విడుదల: 18-05-2026.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe