Inter Admissions 2026 : బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు.. పరీక్ష లేదు.. నేరుగా సీటు.. ఎలా అప్లై చేయాలి?

Inter Adimissions 2026 : బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రాసెస్ మొదలైంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి.

Published on: Apr 21, 2026 6:18 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. సొసైటీ పరిధిలో 290 కళాశాలల్లో 24,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు

తెలంగాణలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే, కేవలం మీ టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 22
  • చివరి తేదీ: మే 12

సీట్ల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలుర, బాలికల కళాశాలల్లో మొత్తం 24,740 పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. సొసైటీ పరిధిలో 290 కళాశాలల్లో 24,740 సీట్లు అందుబాటులో ఉన్నాయని సైదులు వెల్లడించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. MPC, BPC, CEC, కొన్ని వృత్తి విద్యా కోర్సులు(Vocational Courses) అందుబాటులో ఉంటాయి.

  • బాలుర కళాశాలలు: 12,640+ సీట్లు
  • బాలికల కళాశాలలు: 12,000+ సీట్లు

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

  • పదవ తరగతి హాల్ టికెట్ నంబర్.
  • కులం ధృవీకరణ పత్రం (Caste Certificate).
  • ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate).
  • ఆధార్ కార్డు వివరాలు.

ముఖ్య గమనిక

ఇప్పటికే బీసీ గురుకుల పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారికి నేరుగా 'ఇన్ హౌస్' కోటా కింద సీట్లు కేటాయిస్తారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లకు అర్జీ ఇస్తే సరిపోతుంది. ప్రైవేట్ లేదా ఇతర ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మార్కులు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు 040-23328266 నెంబర్‌లో సంప్రదించాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More