TG Inter Supplementary Exams : తెలంగాణ ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు కీలక అప్డేట్.. ఏంటంటే?

TG Inter Supplementary Exams : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు కీలక్ అప్డేట్ వచ్చింది. ఫీజు చెల్లింపు తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published on: Apr 20, 2026 3:29 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. నిజానికి ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు ఏప్రిల్ 23వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

విద్యార్థులు వారు చదువుతున్న కాలేజీలోనే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా… మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సంవత్సరం పరీక్షలు… మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13, 2026వ తేదీ నుంచి నుంచి మెుదలుకానున్నాయి. రోజుకు రెండు సెషన్స్‌లో మే 22, 2026వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇక ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు ఏవైనా కారణాల వల్ల హాజరుకాలేకపోయిన విద్యార్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. మే 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు వీరికి ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఆంగ్ల భాషకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలను మే 26న జరపాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.

కేవలం ఫెయిలైన విద్యార్థుల కంటే మార్కులు పెంచుకోవాలనుకునే ప్రథమ సంవత్సరం విద్యార్థులే ఈ పరీక్షలకు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు 75 శాతం మంది విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్టులో మళ్లీ పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపుతారని ఇంటర్ బోర్డు అంచనా. ఒకవేళ సప్లిమెంటరీలో మార్కులు తగ్గితే.. గతంలో వచ్చిన పాత మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే విద్యార్థికి ఎలాంటి నష్టం ఉండదు. ఈ వెసులుబాటు ఉండటంతో మెరుగైన మార్కుల కోసం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

పరీక్షల షెడ్యూల్ వివరాలు

మే 13: సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-I & II)

మే 14: ఇంగ్లీష్ (పేపర్-I అండ్ II)

మే 15: మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ / మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

మే 16: మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ / మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ

మే 18: ఫిజిక్స్, ఎకనామిక్స్ (పేపర్-I & II)

మే 19: కెమిస్ట్రీ, కామర్స్ (పేపర్-I & II)

మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (BiPC విద్యార్థులకు)

మే 21: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ (పేపర్-I & II)

  • ఈ సంవత్సరం ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.4 కాగా.. బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది.
  • ఇక సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 5,07,948 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 3,58,490 మంది (70.58 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
  • బాలికల ఉత్తీర్ణత శాతం చూసుకుంటే 78.65గా ఉంది. అదే బాలురు ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పుకోవాలి.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More