ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) లో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో మొత్తం 28 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యవధి జూలై 2026 నుండి జూన్ 2031 వరకు ఐదేళ్ల పాటు ఉండనుంది. ప్రారంభ నియామకం ఒక సంవత్సరం కాలానికి ఉంటుంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా ఈ కాంట్రాక్ట్‌ను ఏటా పొడిగిస్తారు.
ఖాళీల వివరాలు…
- స్టేట్ కోఆర్డినేటర్ : 1 పోస్టు (వేతనం: రూ. 1,30,000 - 1,80,000)
- నేషనల్ టెక్నికల్ కోఆర్డినేటర్ : 1 పోస్టు (వేతనం: రూ. 1,30,000 - 1,80,000) ఆక్వాకల్చర్ స్పెషలిస్ట్ : 1 పోస్టు (వేతనం: రూ. 1,00,000 - 1,26,000)
- వాల్యూ చైన్ - మార్కెట్ స్పెషలిస్ట్ : 1 పోస్టు (వేతనం: రూ. 70,000 - 90,000)
- ఫీల్డ్ టెక్నికల్ అసోసియేట్ : 7 పోస్టులు (వేతనం: రూ. 40,000 - 60,000)
- ఫైనాన్స్ - అడ్మినిస్ట్రేషన్ స్పెషలిస్ట్ : 1 పోస్టు (వేతనం: రూ. 80,000 - 90,000)
- మ్యాపింగ్ అండ్ ఎవాల్యుయేషన్ స్పెషలిస్ట్: 1 పోస్టు (వేతనం: రూ. 70,000 - 90,000)
- నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ & కమ్యూనికేషన్ స్పెషలిస్ట్: 1 పోస్టు (వేతనం: రూ. 70,000 - 90,000)
- ప్రాజెక్ట్ సపోర్ట్ అసిస్టెంట్ : 1 పోస్టు (వేతనం: రూ. 40,000 - 60,000)
- ఐటీ - ఎంఐఎస్ స్పెషలిస్ట్ : 1 పోస్టు (వేతనం: రూ. 70,000 - 90,000)
- జెండర్ & సోషల్ ఇన్‌క్లూజన్ స్పెషలిస్ట్: 1 పోస్టు (వేతనం: రూ. 70,000 - 90,000)
- ఎఫ్ఎఫ్‌పీఓ ఎక్స్‌పర్ట్: 1 పోస్టు (వేతనం: రూ. 70,000 - 1,00,000)
- కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (CRP): 10 పోస్టులు (వేతనం: రూ. 20,000 - 22,000)

అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత పోస్టును బట్టి ఇంటర్మీడియట్ (సైన్స్), డిప్లొమా, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఫిషరీస్, ఆక్వాకల్చర్, రూరల్ డెవలప్‌మెంట్, ఎంబీఏ, ఐటీ వంటి విభాగాలు) పూర్తి చేసి… తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రతి పోస్టుకు అత్యధిక మార్కులు సాధించిన 5 నుండి 6 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం ఇలా…..
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, నింపిన అప్లికేషన్ ఫారమ్‌తో పాటు సంబంధిత విద్యార్హతలు, అనుభవ సర్టిఫికెట్ల ప్రతులను (Hard copies) పోస్ట్ ద్వారా మాత్రమే విజయవాడలోని చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
- దరఖాస్తు పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేదీ: 31.10.2026 సాయంత్రం 5:00 గంటల వరకు అవకాశం
- అధికారిక వెబ్‌సైట్: https://fisheries.ap.gov.in/
- పోస్టల్ చిరునామా : FAO-GEF8 PMU,ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ఫిషరీస్,ఫిష్ పాండ్స్, పెనమలూరు,విజయవాడ, ఆంధ్రప్రదేశ్ - 521137.
- ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు 9573337484 / 9440814704 ఫోన్ నంబర్లను లేదా faogef8@gmail.com ఈమెయిల్‌ను సంప్రదించవచ్చు.