BRAOU AP Degree Admissions : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు

డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించారు.

Published on: Oct 2, 2026, 21:03:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే ఉద్యోగులకు, రెగ్యులర్ కళాశాలలకు వెళ్లలేని విద్యార్థులకు డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అప్డేట్ వచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా…. అయితే విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును అధికారులు అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగించారు.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ అడ్మిషన్లు
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ అడ్మిషన్లు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వర్సిటీ పలు కీలక యూజీ కోర్సులను డిజైన్ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ , బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc - ఎంపీసీ, ఎంపీసీఎస్ విభాగాల్లో) కోర్సులతో పాటు ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (BLISc) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

అర్హతలు - నిబంధనలు:

ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్మీడియట్, 10+2 (నేషనల్/ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ - NIOS/APOS), పాలిటెక్నిక్ డిప్లొమా, లేదా రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. బీఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే వారు మాత్రం తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌లో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి.

ప్రవేశాలు కోరే విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన యూజీసీ-డిఇబి నిబంధనలకు లోబడి ఉండాలి. దీని ప్రకారం అభ్యర్థులు తమ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC-ID) తో పాటు DEB-ID ని తప్పనిసరిగా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొదటి సంవత్సరం సాధారణ డిగ్రీ కోర్సులకు ట్యూషన్ ఫీజును రూ. 3,300 గా నిర్ణయించారు. అయితే సైన్స్, కంప్యూటర్ కోర్సులు ఎంచుకునే అభ్యర్థులు ప్రాక్టికల్స్ నిమిత్తం అదనంగా లాబ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీకి విస్తరించి ఉన్న 73 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ తరగతులు, స్టడీ మెటీరియల్ పంపిణీ సేవలను విశ్వవిద్యాలయం అందిస్తోంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీలోగా అధికారిక వెబ్‌‌సైట్ www.drbraouap.ac.in ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని వర్సిటీ యంత్రాంగం స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More