గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు - ఏపీ ప్రభుత్వం ప్రకటన
గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 26, 2027వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు జరుగుతాయని దేవాదాయశాఖ పేర్కొంది.
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఈ తేదీలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజులపాటు ఈ పుష్కరాలు ఉంటాయని పేర్కొంది.

చాలా రోజుల తేదీల ఖరారపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ వచ్చింది. అయితే చివరగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తాన సిధ్ధాంతి శ్రీ థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం కీలకంగా నిలిచింది. పుష్కరాల ప్రవేశ–ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణను ఎండోవ్మెంట్స్ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం…. తేదీలను ఖరారు చేసింది.
12 ఏళ్లకు ఓసారి…
గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగు మహోత్సవం. బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో గోదావరి నదిలో స్నానం చేసుటను అత్యంత పవిత్రంగా భావిస్తారు. లక్షలాది భక్తులు నది తీరాలకు చేరుకుని స్నానాలు, దానాలు, పూజలు నిర్వహిస్తారు. పుష్కరాలు మొత్తం 12 రోజులు ఉంటాయి మరియు మొదటి రోజును పుష్కర ఆరంభం/అద్య పుష్కరం అంటారు.
రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం ఇప్పటికే చాలా రోజులుగా కసరత్తు కూడా చేస్తోంది. పనులు పురోగతిలో ఉన్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

