ఆ 60 ఆలయాల్లోనూ తిరుమల తరహాలో అన్నప్రసాదాలు - ఏర్పాట్లపై TTD కసరత్తు

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న 60 ఆలయాలలోనూ అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ కసరత్తు చేస్తోంది.

Published on: Dec 12, 2025, 16:18:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీటీడీ ఆలయాలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాద వితరణ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ఆధ్వర్యంలోని 60 ఆలయాలలో అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది.

అన్నప్రసాద వితరణకు టీటీడీ ఏర్పాట్లు
అన్నప్రసాద వితరణకు టీటీడీ ఏర్పాట్లు

అన్నప్రసాద వితరణ నేపథ్యం…

తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏప్రిల్ 06, 1985 తేదీన టీటీడీ శ్రీకారం చుట్టింది. తొలుత ఎస్వీ నిత్య ప్రసాద స్కీం క్రింద 2 వేల మందికి అన్నప్రసాదరణ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. ఆ తరువాత 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది.

ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా ఏప్రిల్ 01, 2014న నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. 2011, జులై 7 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ భవనాన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారు. నవంబర్ 15 నాటికి రూ. 2,316 కోట్లు ఈ ట్రస్ట్ కు డిపాజిట్ గా జమ అయ్యాయి.

తిరుమలలో….

తిరుమలలోని శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు, రాంబగీచ బస్టాండు, ఏఎంసీ, సిఆర్‌వో, పిఏసి-1 వద్ద ఫుడ్‌ కౌంటర్లు, పీఏసీ – 2, పీఏసీ – 4, పీఏసీ – 5 హాల్స్, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణ గిరి షెడ్స్, బయటి క్యూ లైన్స్ లలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలో సాధారణ రోజులలో రోజుకు 1.80 లక్షల ముండి 1.90 మంది, వారాంతపు రోజులలో రోజుకు 2 లక్షల నుండి 2.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాలలో గరుడసేవ రోజున సరాసరి 2 లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.

తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, శ్రీనివాసం, విష్ణునివాసం, శ్రీనివాసం, విష్ణునివాసం, ఆసుపత్రులలో, ఒంటిమిట్టలోని శ్రీ కోందరరామ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. సదరు కేంద్రాలలో సాధారణ రోజులలో 15 వేల నుంచి 16 వేలకు మంది, వారాంతపు రోజులలో 18 వేల నుంచి 20 వేల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

త్వరలో 60 టీటీడీ ఆలయాలలో….

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలోనే 60 టీటీడీ ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదర చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నప్రసాద వితరణకు ఇప్పటికే టీటీడీ ఈవో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. అన్నప్రసాదం వితరణ, తయారీకి ధార్మిక సంస్థలు, మఠాలు ముందుకు వచ్చే వారితో అవగాహణ చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More