టీటీడీ 2026 శ్రీవారి డైరీలు, క్యాలెండర్ల ధరలు.. ఎలా బుక్ చేసుకోవాలి? ఎక్కడ దొరుకుతాయి?

టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు కావాలనుకునే భక్తులు ఈజీగా పొందవచ్చు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు

Updated on: Dec 11, 2025, 11:06:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీ‌వారి భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు-13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు - 75 వేలు, పెద్ద డైరీలు - 8.50 లక్షలు, చిన్నడైరీలు - 3 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు - 2.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు - 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు - 3 లక్షలు, టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు - 10 వేలను అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది.

టీటీడీ క్యాలెండర్లు, డైరీలు
టీటీడీ క్యాలెండర్లు, డైరీలు

ధరలు

12 పేజీల క్యాలెండర్ రూ.130, డీలక్స్ డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75, 6 పేజీల 3డి డిజిట‌ల్‌ క్యాలెండర్ రూ.450, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్-రూ.30, టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు-రూ.130గా ఉన్నాయి.

ఇక్కడ దొరుకుతాయి

తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.

చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయిస్తున్నారు.

అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల‌ కోసం డైరీలు, క్యాలెండర్లు సిద్ధంగా ఉంచారు.‌

ఆన్‌లైన్‌లో బుకింగ్

అదేవిధంగా డైరీలు, క్యాలెండర్లు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో భక్తులకు విక్రయిస్తోంది. ఇందులో 12 పేజీల క్యాలెండర్, డీలక్స్ డైరీ, చిన్న డైరీ, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్, 6 పేజీల 3డి క్యాలెండర్‌లను టీటీడీ వెబ్‌సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు తపాలా శాఖ ద్వారా పంపిస్తారు.

డీడీ తీసి పంపొచ్చు

భక్తులు డీడీ తీసి పంపినా టీటీడీ క్యాలెండర్‌, డైరీలను పొందవచ్చు. ఇందుకోసం ” కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి ” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి డెప్యూటీ ఈవో, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. తపాలా శాఖ ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్‌, డైరీలను పంపుతారు. రవాణా ఛార్జీలను అదనంగా తపాలా శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.

క్యాలెండర్‌, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More