తిరుమలకు వచ్చే వాహనాలలో భక్తి పాటలు వినిపించేలా ఏర్పాట్లు : టీటీడీ ఈవో
దర్శన క్యూలైన్లలో భక్తులకు అందించే అన్న ప్రసాదాలు వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలకు వచ్చే వాహనాలలో భక్తి పాటలు వినిపించేలా ఏర్పాట్లపై పరిశీలిస్తామని చెప్పారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 23 మంది భక్తులు తమ సలహాలు, సూచనలు అందించారు. భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం చెప్పారు.

ఆన్ లైన్ లో దివ్యాంగులకు, వృద్ధులకు ఒకే స్లాట్ ఇవ్వడంతో టోకెన్లు బుక్ చేసుకోలేకపోతున్నామని, ఆఫ్ లైన్ ద్వారా దివ్యాంగులకు టోకెన్లు కేటాయిస్తే బాగుంటుందని ఓ భక్తుడు అడిగారు. అన్ని వర్గాలవారినీ దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ ఈవో వెల్లడించారు.
నాది నీరాజనం వేదికపై భారతం, రామాయణం, అన్నమయ్య కీర్తనలను పఠించే కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. దీనిపై అధికారులు పరిశీలిస్తున్నారని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
రూ.లక్ష విరాళంగా ఇచ్చిన దాతలకు దర్శనాలు దొరకడం లేదని భక్తుడు అడగ్గా.. మూడు నెలలు ముందుగా దాతల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తామని చెప్పారు ఈవో.
ఈ సందర్భంగా పలువురి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. లక్షలాదిమంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కోటాను పెంచుతూ పోతే క్యూలైన్ల నిర్వహణ కష్టతరమవుతుందన్నారు. ఎక్కువమంది భక్తులకు మేలు చేసేవిధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగిందని తిరుపతికి చెందిన చంద్రశేఖర్ చెప్పారు. చివరి మూడు రోజులు కాకుండా మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుంటుందన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పవిత్రమైనవేని. అన్ని రోజులు సమానంగా భావించి స్థానికులు దర్శనం చేసుకోవాలన్నారు టీటీడీ ఈవో. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజుల్లో స్థానికులకు కేటాయించామన్నారు. స్థానికులపై చిన్న చూపు లేదని స్పష్టం చేశారు.
అన్ని వర్గాల భక్తులను దృష్టిలో పెట్టుకుని పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో చెప్పారు. గోవిందమాల భక్తులు కూడా జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శనంలో స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.
రూ.300 దర్శనాల్లో కంపార్ట్మెంట్ లో కూర్చోబెడుతున్నారని, దర్శన సమయం ముందుగానే తెలిసే ఏర్పాటు చేస్తే బాగుంటుందని, క్యూ లైన్లలో అన్న ప్రసాదాలు ఇవ్వడం వల్ల భక్తులు వృథా చేస్తున్నారని ఓ భక్తుడు టీటీడీ ఈవో దృష్టికి తీసుకువచ్చారు. దర్శన సమయం తెలిసేలా డిస్‌ప్లేలు ఏర్పాటు చేస్తామన్నారు. VQC క్యూలైన్లలో భక్తులు అన్న ప్రసాదం వృథా చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
'తిరుమలకు వచ్చేటప్పుడు ట్యాక్సీ ల్లో సినిమా పాటలు పెడుతున్నారు. ప్రయాణ సమయంలో గోవిందనామ స్మరణ చేసేలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తిరుమలలో గోవింద నామావళి బోర్డులు కనిపించడం లేదు. మాడ వీధుల్లో భక్తులు పాదరక్షలతో తిరుగుతున్నారు.' అని ఓ భక్తుడు అడిగారు. మీ సూచనలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


