తిరుపతిలో పుట్టి-యుఎస్‌లో జాబ్-ఫ్యామిలీ మ్యాన్ సిరీస్-అప్పటి నుంచే సమంతతో లవ్-రాజ్ నిడిమోరు గురించి తెలుసా?
రాజ్ నిడిమోరు.. ఈ పేరు ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సమంతను రెండో పెళ్లి చేసుకున్న ఈ డైరెక్టర్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మరి రాజ్ నిడిమోరు ఎవరు? అతను తీసిన సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇక్కడ చూసేయండి.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత రెండో పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఇవాళ (డిసెంబర్ 1) కొయంబత్తూర్ లో వివాహమాడిందని తెలిసింది. విశ్వసనీయ వర్గాలు హిందూస్థాన్ టైమ్స్ కు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో సమంత రెండో భర్త ఎవరు? రాజ్ నిడిమోరు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మరి రాజ్ నిడిమోరు గురించి ఇక్కడ తెలుసుకోండి.

తిరుపతిలో జననం
రాజ్ అండ్ డీకే ద్వయంతో పాపులర్ అయిన వాళ్లలో ఒకరే రాజ్ నిడిమోరు. ఈయన మన తెలుగు వ్యక్తే. 1975 ఆగస్టు 4న తిరుపతిలో జన్మించాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బి.టెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు.
సినిమాలపై ప్రేమ
యుఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నప్పటికీ సినిమాలపై ప్రేమను చంపుకోలేకపోయాడు రాజ్ నిడిమోరు. అందుకే జాబ్ వదిలేసి డీకే (కృష్ణ దాసరి కొత్తపల్లి)తో కలిసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వీళ్లు షాదీ.కామ్ అనే షార్ట్ ఫిల్మ్ ను ఫస్ట్ రూపొందించారు. ఇది 2002లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 2003లో రాజ్ అండ్ డీకే కలిసి డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘ఫ్లేవర్స్’. ఇది ఇంగ్లీష్ సినిమా.
బాలీవుడ్ డెబ్యూ
2009లో ‘99’ అనే సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేశాడు రాజ్ నిడిమోరు. ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ అనే హిందీ సినిమాలకు దర్శకుడు, రచయితగా వ్యవహరించాడు. తెలుగులో 2013లో వచ్చిన డీ ఫర్ దోపిడీ మూవీకి నిర్మాత రాజ్ నిడిమోరు.
అనంతరం ఎ జెంటిల్ మ్యాన్, స్త్రీ సినిమాలు చేశారు. 2019లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మరింత పాపులర్ అయ్యారు. తర్వాత డైరెక్టర్, రచయిత, ప్రొడ్యూసర్ గా సినిమా బండి, ఫర్జీ, సిటాడెల్ హనీ బన్నీ అనే ప్రాజెక్టులకు పనిచేశారు.
సమంతతో లవ్
రాజ్ నిడిమోరు గతంలో శ్యామలి డేను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట 2022లో విడిపోయింది. 2021లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజైంది.ఇందులో సమంత నటించింది. ఈ సీజన్ షూటింగ్ సందర్భంగానే సమంత, రాజ్ నిడిమోరు మధ్య పరిచయం మొదలైంది.
అనంతరం సిటాడెల్ హనీ బన్నీ కోసం కూడా సమంత, రాజ్ కలిసి పనిచేశారు. దీంతో వీళ్ల మధ్య స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో రాజ్ నిడిమోరు, సమంత రహస్యంగా వివాహం చేసుకున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


