కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...!

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 

Published on: Nov 30, 2025, 10:16:25 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం…. 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖ, అమరావతి, రాయలసీమ పేర్లతో ఈ జోన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసిన ఏపీ సర్కార్… ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీలో జోన్లు - సర్కార్ కీలక నిర్ణయం...!
ఏపీలో జోన్లు - సర్కార్ కీలక నిర్ణయం...!

3 జోన్లు…

విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలతో ఒక జోన్ ఏర్పాటు చేస్తే… అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో మరో జోన్ ఉంటుంది. ఇక రాయలసీమ 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనమిక్‌ రీజియన్‌ ఏర్పాటు కానున్నాయి. బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రతి జోన్ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్కో జోన్ కు సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించనుంది. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను నీతి ఆయోగ్ , సింగపూర్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. దీనికి అనుబంధంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో ఓ స్టీరింగ్ కమిటీని కూడా పని చేయనుంది. ఈ కొత్త జోన్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతోంది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి.వీటి విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో ఆయా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ ఓవైపు జరుగుతుండగానే… మరోవైపు జోనల్ వ్యవస్థపై కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More