AP Property Tax : ఏపీ సర్కార్ శుభవార్త - ఆస్తి పన్ను వడ్డీలో 50 శాతం డిస్కౌంట్, ఇక ఆలస్యం చేయకండి..!
మున్సిపాలిటీల్లోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈనెల 31లోపు బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీ ప్రకటించింది.
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీని కల్పించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మార్చి 31 వరకు ఛాన్స్…!
ఈ రాయితీ అవకాశం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న బకాయిలను చెల్లించేందుకు ముందుకొస్తే… వడ్డీపై రాయితీని పొందొచ్చు. ఇక ఇప్పటికే పలువురు వడ్డీతో పాటు పన్ను చెల్లించారు. అయితే వీరికి తదుపరి బిల్లులో మినహాయింపు ఇస్తామని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేక అవకాశం ద్వారా చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. గతేడాది మార్చిలో కూడా ఏపీ ప్రభుత్వం ఆస్తిపన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ ప్రకటించింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈసారి కూడా చాలా మంది ఆస్తి పన్నుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని… పాత బకాయిలను క్లియర్ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 86 మున్సిపల్, కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీకాలం ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రేపట్నుంచి నుంచి ప్రత్యేకాధికారుల పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో 2021 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు.. అప్పటి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరి పదవీకాలంలో మార్చి 17వ తేదీతో పూర్తవుతుంది.
కార్పొరేషన్‌లలో ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు, మున్సిపాలిటీల్లో జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చూడనున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల సమస్యసలపై సత్వరమే స్పందించి పరిష్కరించాలని… ప్రభుత్వం కూడా సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

