ఇంటినే కాదు మున్సిపాలిటీని కూడా ఏలుతారు.. మున్సిపల్ ఎన్నికల్లో 1,019 మంది హోమ్ మేకర్స్ విక్టరీ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో గృహిణులు సత్తా చాటారు. భారీగా సీట్లను గెలిచారు. ఇంటినే కాదు.. మున్సిపాలిటీని కూడా వారే ఏలనున్నారు.

Published on: Feb 14, 2026, 10:59:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,019 మంది గృహిణులు ఎన్నికయ్యారని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కూడా ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

మొత్తం 2,995 మంది అభ్యర్థులు వార్డల్లో ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. విజేతలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు.. 1,356 మంది పురుషులతో పోలిస్తే 1,638 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఎన్నికైన ప్రతినిధుల సగటు వయస్సు 42.4 సంవత్సరాలుగా ఉంది.

ఎన్నికైన ప్రతినిధులలో 1,924 మంది గ్రాడ్యుయేట్లు, 194 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని ఈసీ డేటా చూపిస్తుంది. ఎన్నికైన ఏ అభ్యర్థి నిరక్షరాస్యుడిగా నమోదు కాలేదు.

1,019 మంది గృహిణులతో పాటు, 676 మంది ఎన్నికైన ప్రతినిధులు వ్యాపారాన్ని తమ వృత్తిగా నమోదు చేసుకున్నారు, 555 మందిని 'ఇతర' కింద చూపించుకున్నారు. 69 మంది తమను తాము ప్రైవేట్ ఉద్యోగులుగా చెప్పుకున్నారు. 644 మంది తమ వృత్తిని పేర్కొనలేదు.

ఎన్నికైన 1,019 మంది గృహిణులలో 550 మంది కాంగ్రెస్ నుండి, 260 మంది బీఆర్ఎస్ నుండి, 106 మంది బీజేపీ నుండి ఉన్నారు. ఇక 60 మంది స్వతంత్రులు ఈ లిస్టులో ఉన్నారు. ఏఐఎంఐఎంకి 19 మంది గృహిణులు, AIFB 10, సీపీఐ 9, సీపీఎం 4, బీఎస్పీకి ఒకరు ఉన్నారు.

గ్రాడ్యుయేట్లలో 885 మంది కాంగ్రెస్, 472 మంది బీఆర్ఎస్, 199 మంది బీజేపీ, 95 మంది స్వతంత్రులకు చెందినవారు. AIMIM 31 మంది గ్రాడ్యుయేట్ విజేతలు ఉండగా.. AIFB 21, సీపీఐ 20, సీపీఎం 6, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 99 మంది కాంగ్రెస్, 48 మంది బీఆర్ఎస్, 30 మంది బీజేపీ, తొమ్మిది మంది స్వతంత్రులు ఉన్నారు. ఈసీ డేటా ప్రకారం సీపీఐకి నలుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండగా, AIMIM, AIFBకి ఇద్దరు చొప్పున ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 84 వరకు స్థానాలు గెలుచుకుంది. పోటీ చేసిన 2,996 వార్డులలో 1,537 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాలు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ 781 సీట్లతో 25 మునిసిపాలిటీలను గెలుచుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ సంస్థలు, 335 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఒక మునిసిపాలిటీని కైవసం చేసుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More