Sign in

దీపావళి వేళ ఏపీ ఉద్యోగులకు తీపి కబురు - డీఏ జీవో విడుదల

దీపావళి పండగ వేళ ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏను విడుడల చేసింది. 3.64 శాతం డీఏ పెంచినట్లు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

Published on: Oct 20, 2025, 12:37:01 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దీపావళి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఒక డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఈ డీఏ పెంపు నిర్ణయం…. 2024 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67 ఉండగా… అది 37.31 శాతానికి పెరగనుంది.

డీఏ జీవో విడుదల
డీఏ జీవో విడుదల

ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి నెలకు రూ.165 కోట్ల అదనపు భారం పడుతుంది. పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్స్ డబ్బులు కూడా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని ఈ ఏడాది నవంబర్, 2026 జనవరిలో రెండు దఫాలుగా చెల్లిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు సోమవారం లోపు అందిస్తారు.

ఇటీవలే ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఒక డీఏపై నిర్ణయం తీసుకోవటమే కాకుండా… పలు అంశాలపై కూడా చర్చించారు. ఉద్యోగుల హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. దీన్ని 60 రోజుల్లోగా పూర్తి చేసేలా కెబినెట్ సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు.

ఉద్యోగుల వైద్య సేవల పథకం (EHS) ను 60 రోజుల్లోగా మెరుగుపరిచి, మెరుగైన సేవలు అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్యూన్, వాచ్‌మెన్, అటెండర్, ప్లంబర్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల పేర్లను గౌరవప్రదంగా మార్చాలని నిర్ణయించారు. త్వరలోనే వీటిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More