మునగ రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీలో కొత్తగా 19 ప్రాసెసింగ్ యూనిట్లు
మునగ ప్రాసెసింగ్‌తో రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.
రైతుల ఆదాయాలను పెంచడం, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాల(FPOs) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యోచిస్తోందని ఎస్ఈఆర్పీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కడపలోని వీరబల్లి, తిరుపతిలోని యర్రవరిపాలెంలో విజయవంతమైన ప్రాసెసింగ్ కేంద్రాలను ఆదర్శంగా తీసుకుని SERP కింద ఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ కార్యక్రమం రైతులను కేవలం పచ్చి మునగాకు అమ్మకానికే పరిమితం చేయకుండా.. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ నుండి బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు చైన్ సిస్టమ్‌లో పాలుపంచుకునేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
స్థానిక వాతావరణం, సాగు విస్తీర్ణం, ముడి పదార్థాల లభ్యత, రైతుల ఆసక్తి, ఎఫ్‌పీఓల సామర్థ్యం ఆధారంగా యూనిట్లను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం తమిళనాడులోని పెరియకుళంలో ఉన్న ఉద్యానవన కళాశాల, పరిశోధనా సంస్థ నుండి అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను సేకరించి రైతులకు సరఫరా చేస్తుంది.
ప్రాసెసింగ్, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్ పద్ధతులపై రైతులకు, ఎఫ్‌పీఓల ప్రతినిధులకు అవగాహన కల్పించడానికి అధ్యయన పర్యటనలు కూడా చేస్తారు. యర్రావరిపాలెంలోని ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ రోజుకు 250 కిలోల మునగ పొడిని ఉత్పత్తి చేస్తోంది. రూ. 86.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్, 300 ఎకరాల నుండి మునగ ఆకులను సేకరిస్తుంది.
ఒక కిలో మునగాకును ఉత్పత్తి చేయడానికి రైతులు రూ. 10 ఖర్చు చేస్తుండగా.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) వాటిని కిలో రూ. 15 చొప్పున కొనుగోలు చేస్తున్నాయని, దీనివల్ల రైతులకు కిలోకు రూ. 5 లాభం లభిస్తోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద అర్హులైన రైతులు ఎకరానికి రూ. 1.30 లక్షల వరకు అభివృద్ధి సహాయం పొందవచ్చు. మునగ సాగు ద్వారా రైతులకు నెలకు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు నికర ఆదాయం లభించవచ్చని ఆయన తెలిపారు.
మునగాకు సాగుకు ఎక్కువ నీటి అవసరం ఉండదు. వర్షాభావ, కరవు ప్రాంతాలలో కూడా ఈ పంట ఏపుగా పెరుగుతుంది. ఇతర సాంప్రదాయ పంటలతో పోలిస్తే తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉండటంతో పురుగుమందుల ఖర్చు దాదాపు ఉండదు. ఒక్కసారి నాటుకుంటే ఏళ్లకు ఏళ్లు క్రమం తప్పకుండా దిగుబడిని ఇస్తుంది.
కేవలం పచ్చి ఆకును అమ్మడమే కాకుండా, సేకరించిన ఆకులను నీడన ఆరబెట్టి, పొడి చేసి విక్రయించడం ద్వారా రైతులు రెట్టింపు లాభాలు పొందుతున్నారు. స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ద్వారా విక్రయాలు జరుపుతుండటంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు నేరుగా మంచి ధర లభిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


