OTT Telugu: మూడు నెలలకు ఓటీటీలోకి తెలుగు మూవీ.. ఐటీ యూత్, యువ రైతులు తప్పకుండా చూడాల్సిన డిఫరెంట్ సినిమా.. ఎక్కడంటే?

OTT Telugu: యంగ్ హీరో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఐటీ యూత్, యువ రైతులు చూడాల్సిన మూవీ ఇది. నవ్వులు అందిస్తూనే ఆలోచింపజేసే ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ వివరాలు ఇవే!

Published on: Aug 10, 2026, 11:08:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: ఐటీ ఉద్యోగుల జీవితాల్లో భాగమైపోయిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన సరికొత్త ఫన్ రైడర్ మూవీ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ (Mr. Work From Home). ఈ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

మూడు నెలలకు ఓటీటీలోకి తెలుగు మూవీ.. ఐటీ యూత్, యువ రైతులు తప్పకుండా చూడాల్సిన డిఫరెంట్ సినిమా.. ఎక్కడంటే?
మూడు నెలలకు ఓటీటీలోకి తెలుగు మూవీ.. ఐటీ యూత్, యువ రైతులు తప్పకుండా చూడాల్సిన డిఫరెంట్ సినిమా.. ఎక్కడంటే?

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓటీటీ

నవ్వుల ఎంటర్‌టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సౌత్ ఇండియాలోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) దక్కించుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్‌లో నేరుగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.

ఓటీటీలో నవ్వుల జాతర

యంగ్ హీరో త్రిగుణ్ (Thrigun) ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రంలో హీరోగా నటించాడు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు వైవా హర్ష, సత్యతో పాటు సీనియర్ నటుడు అనీష్ కురువిల్లా (Anish Kuruvilla) కీలక పాత్రల్లో నటించారు.

థియేటర్లలో ఈ సినిమా మే 15న రిలీజ్ అయింది. మూవీకి బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వినిపించింది. ఇప్పుడు మూడు నెలలకు ఈ చిత్రం ఓటీటీ బాట పట్టనుంది. మరి డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

స్టోరీ ఏంటంటే?

అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండియాకు వస్తాడు. ఆర్గానికి వ్యవసాయం చేయాలనుకుంటాడు. ఫార్మింగ్ లో కొత్త టెక్నాలజీలు ప్రవేశపెడతాడు. రైతుల కోసం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే యాప్ డిజైన్ చేస్తాడు.

మరోవైపు మహి (పాయల్ రాధాకృష్ణ)ని అరవింద్ ప్రేమిస్తాడు. అయితే ఒక నెల రోజుల పాటు తన మెయింటేనెన్స్ ఖర్చులు మొత్తం భరించాలని మహి కండీషన్ పెడుతుంది. మరి అరవింద్ ఏం చేశాడు? రైతుల జీవితాలను ఎలా మార్చాడు? తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నదే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ స్టోరీ.

ఐటీ ఆడియన్స్ అండ్ యూత్‌కు పర్ఫెక్ట్

ఆగస్టు 15 వీకెండ్ సెలవులను పురస్కరించుకుని కుటుంబ సమేతంగా, ముఖ్యంగా ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ సరదాగా రిలాక్స్ అవుతూ చూసేందుకు 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనుంది. అంతే కాకుండా యువ రైతులు ఈ మూవీని తప్పకుండా చూడాలి. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇందులో చూపించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More