Spider Man OTT: ఓటీటీలోకి 12 వేల కోట్ల స్పైడర్ మ్యాన్ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Spider Man OTT: బాక్సాఫీస్ వద్ద $1.2 బిలియన్ డాలర్ల రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న టామ్ హాలండ్ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఓటీటీలోకి రాబోతుంది. ఈ సూపర్ హీరో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ బజ్ ఇదే. థియేటర్లను షేక్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Aug 9, 2026, 13:40:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Spider Man OTT: టామ్ హాలండ్ హీరోగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU), సోనీ పిక్చర్స్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ఓటీటీలోకి 12 వేల కోట్ల స్పైడర్ మ్యాన్ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? (Anshuman Poyrekar/HT Photo)
ఓటీటీలోకి 12 వేల కోట్ల స్పైడర్ మ్యాన్ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? (Anshuman Poyrekar/HT Photo)

స్పైడర్ మ్యాన్ కలెక్షన్లు

ఐమాక్స్ (IMAX) స్క్రీన్లు అందుబాటులో లేకపోయినా.. భారతదేశంలో విడుదలైన తొలి మూడు రోజుల్లోనే స్పైడర్ మ్యాన్ 4 చిత్రం ఏకంగా రూ.309 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రకంపనలు సృష్టించింది. అంతర్జాతీయంగా వారం రోజులు గడవక ముందే $1 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసి, 'అవేంజర్స్: ఎండ్ గేమ్' తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండవ చిత్రంగా నిలిచింది.

ఈ మూవీ ఇప్పటికే రూ.12000 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 2 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరే దిశగా పరుగులు తీస్తోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?

థియేటర్లలో కలెక్షన్ల ఊచకోత కోస్తున్న ఈ స్పైడీ అడ్వెంచర్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్ 2026 నాటికి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.

డిజిటల్ రిలీజ్ ఎక్కడ?

సోనీ పిక్చర్స్ గ్లోబల్ డీల్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రం థియేట్రికల్ రన్ ముగిశాక మొదట నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.

అయితే ఇండియాలో మొత్తం ఎంసియు (MCU) క్యాటలాగ్‌తో పాటు 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' చిత్రం ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) లో అందుబాటులో ఉంది. అందువల్ల ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పీటర్ పార్కర్ సరికొత్త పోరాటం

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ముగింపులో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) ఉనికిని లోకమంతా మరిచిపోతుంది. 'బ్రాండ్ న్యూ డే' కథలో పీటర్ ఆ ఏకాంతాన్ని, బాధను దిగమింగుకుంటూ పూర్తిస్థాయి స్పైడర్ మ్యాన్ గా మారి నేరాలను అరికడుతుంటాడు.

అయితే, పీటర్ గతం నుంచి దూరమైన అతని మాజీ ప్రేమికురాలు ఎంజే (జెండయా), ప్రాణస్నేహితుడు నెడ్ (జాకబ్ బాటలోన్) లకు విలన్ మ్యూటెంట్ జీన్ గ్రే (సేడీ సింక్) రూపంలో పెద్ద ముప్పు ఎదురవుతుంది. వారిని కాపాడుకోవడానికి పీటర్ తన వ్యక్తిగత జీవితాన్ని, స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌ను ఎలా ఒకటిగా మార్చాడనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో జాన్ బెర్న్థాల్ (పునిషర్), ఫ్లోరెన్స్ పగ్, మార్క్ రుఫాలో (హల్క్), మరీసా టోమే, ట్రానెల్ టిల్మాన్ ముఖ్యాంశ పాత్రల్లో మెరిసారు.

డిజిటల్ రైట్స్ పోరు

సాధారణంగా సోనీ పిక్చర్స్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్‌తో గ్లోబల్ స్ట్రీమింగ్ ఒప్పందం ఉన్నప్పటికీ, భారతదేశంలో మార్వెల్ ఫ్రాంచైజ్ ఆడియన్స్ జియోహాట్‌స్టార్ వైపే ఎక్కువగా ఉన్నారు. థియేటర్లలో $2 బిలియన్ల మార్కును అందుకోవడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నందున ఈ స్పైడర్ మ్యాన్ 4 సినిమా ఓటీటీ విండో కాలపరిమితిని మరో రెండు వారాలు పొడిగించే అవకాశం లేకపోలేదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More