Bigg Boss Agnipariksha: బిగ్‌బాస్ 10 అగ్నిప‌రీక్ష‌ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే.. ఓటీటీ స్ట్రీమింగ్‌లో మిడ్‌నైట్ ట్విస్ట్

Bigg Boss Agnipariksha: తెలుగు ఆడియన్స్ ను టీవీ తెరలకు అతుక్కుపోయేలా చేసే బిగ్ బాస్ రియాలిటీ షో మళ్లీ వచ్చేస్తోంది. బిగ్ బాస్ 10 సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. అంతకంటే ముందు అగ్నిపరీక్ష సీజన్ 2 స్టార్ట్ కానుంది. ఈ అగ్ని పరీక్ష టీవీలో ఏ టైమ్ కు వస్తుందో చూసేయండి. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ పై లుక్కేయండి.

Published on: Aug 6, 2026, 13:44:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Agnipariksha: విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు, ఇప్పుడు 10వ సీజన్‌ను ‘దశావతారం’ థీమ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. బుల్లితెర హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి సాధారణ ప్రజల కోసం అగ్నిపరీక్ష సీజన్ 2 ను మరింత ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారని తెలిసింది.

బిగ్‌బాస్ 10 అగ్నిప‌రీక్ష‌ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే.. ఓటీటీ స్ట్రీమింగ్‌లో మిడ్‌నైట్ ట్విస్ట్ (X/StarMaa)
బిగ్‌బాస్ 10 అగ్నిప‌రీక్ష‌ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే.. ఓటీటీ స్ట్రీమింగ్‌లో మిడ్‌నైట్ ట్విస్ట్ (X/StarMaa)

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష షో ఆగస్టు 15న స్టార్ మా (Star Maa), జియోహాట్‌స్టార్ (JioHotstar) లలో స్టార్ట్ కానుంది. ఈ అగ్ని పరీక్ష షో 15 రోజలు పాటు సాగుతుందని తెలిసింది. ఈ అగ్నిపరీక్ష షోకి యాంకర్ గా శ్రీముఖి కొనసాగనుంది. అలాగే జడ్జెస్ గా కూడా అభిజీత్, బిందు మాధవి, నవదీప్‌ ఉంటారు.

15 మంది కామనర్లు

అగ్ని పరీక్ష సీజన్ 2లో షార్ట్‌లిస్ట్ చేసిన 15 మంది సాధారణ కంటెస్టెంట్ల మధ్య శారీరక, మానసిక సవాళ్లతో కూడిన పోటీలు నిర్వహించి వారి సహనానికి పరీక్ష పెడతారు. ఇందులో గెలిచినవారు మెయిన్ హౌస్‌లోకి అడుగుపెడతారు.

టెలికాస్ట్ టైమింగ్స్

బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష షో టీవీలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుందని తెలుస్తోంది. ఇక ఓటీటీ ప్రేమికుల కోసం జియోహాట్‌స్టార్‌లో ప్రతి రోజూ రాత్రి 12:00 AM (మిడ్‌నైట్) కే ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ కావడం స్పెషల్ గా ఉండనుంది.

హోస్ట్‌గా నాగార్జున రిటర్న్

బిగ్ బాస్ 10వ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 'వెరైటీ ఇండియా' తో నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడుతూ బిగ్ బాస్ 10 తెలుగు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈసారి కంటెస్టెంట్ల జాబితాను తాను ముందుగా చూడలేదని, వేదికపై వారిని కలిసినప్పుడు వచ్చే సంభాషణలు చాలా నాచురల్‌గా, స్పాంటేనియస్‌గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇక కుటుంబాలు, పిల్లలు చూసే షో కాబట్టి హౌస్‌లో కంటెస్టెంట్లు గీత దాటి ప్రవర్తిస్తే, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

బిగ్ బాస్ ఎప్పుడూ?

బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ ప్రిమియర్ సెప్టెంబర్ 6, 2026న ఉంటుందని సమాచారం. సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ ఎపిసోడ్లు ప్రారంభం కానున్నాయని అంటున్నారు. ఈ సీజన్ దాదాపు 15 వారాల పాటు సాగనుంది.

బిగ్ బాస్ కు వెళ్తారని సెలబ్రిటీ కోటా కింద పల్లవి గౌడ, దీపికా రంగరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, రాకింగ్ రాకేష్, చంద్రహాస్, తేజస్విని గౌడ, ఉప్పల్ బాలు పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More