Free OTT: ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్ లేదా? డోంట్ వ‌ర్రీ.. అదిరే వెబ్ సిరీస్‌లు ఫ్రీగా చూసేయండి.. ఈ వీకెండ్‌కు ప‌ర్ఫెక్ట్‌ !

Free OTT: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రీగా ఓటీటీ కంటెంట్ చూడాలా? అయితే ఇంకెందుకు లేటు ఈ టాప్ 7 వెబ్ సిరీస్ లను ఓటీటీలో ఫ్రీగా చూసేయండి. ఇందులో క్రైమ్, థ్రిల్లర్, కాలేజ్ డ్రామా, లవ్ స్టోరీస్ జానర్లలో మంచి కిక్ ఇచ్చే కంటెంట్ ఉంది. 

Published on: Aug 6, 2026, 12:44:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Free OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవ లేదు. అయితే నాణ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే నెలకు వందల రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా, కేవలం యాడ్స్ ద్వారా పూర్తి సిరీస్‌లను ఉచితంగా అందించే ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్ MX ప్లేయర్ (Amazon MX Player) ముందంజలో ఉంది.

ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్ లేదా? డోంట్ వ‌ర్రీ.. అదిరే వెబ్ సిరీస్‌లు ఫ్రీగా చూసేయండి.. ఈ వీకెండ్‌కు ప‌ర్ఫెక్ట్‌ !
ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్ లేదా? డోంట్ వ‌ర్రీ.. అదిరే వెబ్ సిరీస్‌లు ఫ్రీగా చూసేయండి.. ఈ వీకెండ్‌కు ప‌ర్ఫెక్ట్‌ !

ఈ అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో మీరు ఉచితంగా వీక్షించగలిగే 7 అత్యుత్తమ వెబ్ సిరీస్‌ల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

ఆశ్రమ్ (Aashram)

ప్రకాష్ ఝా దర్శకత్వంలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సంచలనం ఈ సిరీస్. స్వయంప్రకటిత దొంగ బాబాల సామ్రాజ్యం, ఆధ్యాత్మికత ముసుగులో జరిగే అక్రమాలు, రాజకీయాలు, క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

క్యాంపస్ డైరీస్ (Campus Diaries)

కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కేవలం ర్యాగింగ్, లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా నేటితరం విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, డ్రగ్స్ సమస్యలు, ఫ్రెండ్‌షిప్, ఆశయాల చుట్టూ ఈ కథనం సాగుతుంది.

భౌకాల్ (Bhaukaal)

నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. నటుడు మోహిత్ రైనా ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించారు. ఉత్తరప్రదేశ్‌లోని క్రైమ్ రాజధానిగా పేరొందిన ముజఫ్ఫర్‌నగర్‌లో గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఏరిపారేశారనేది ఇందులో ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు.

సమంతర్ (Samantar)

స్వప్నిల్ జోషి నటించిన మైండ్ బెండింగ్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒకే సమయంలో జన్మించిన ఇద్దరి జాతకాలు ఒకేలా ఉంటాయా? ఒకరి గతం మరొకరి భవిష్యత్తుగా మారితే ఏమవుతుంది? అనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సిరీస్ ఇది.

రక్తంచల్ (Raktanchal)

1980ల నాటి పూర్వాంచల్ గ్యాంగ్‌వార్స్, మైనింగ్ మాఫియా, రాజకీయం నేపథ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ క్రైమ్ డ్రామా. అధికారం కోసం ఇద్దరి మధ్య జరిగే పోరాటం ఇందులో ప్రధాన ఆకర్షణ.

ఇందు (Indu)

ఒక సంప్రదాయ కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త కోడలు ఎదుర్కొనే అనుమానాస్పద సంఘటనల చుట్టూ ఈ ఫ్యామిలీ మిస్టరీ డ్రామా సాగుతుంది. ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఊహించని ట్విస్టులతో సస్పెన్స్ కొనసాగించడంలో ఈ సిరీస్ విజయం సాధించింది.

రూప్ నగర్ కే చీతా (Roop Nagar Ke Cheetah)

చిన్ననాటి స్నేహితుల మధ్య ఉండే అనుబంధం, మారే కాలంతో పాటు వారి జీవితాల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయనేది చూపించారు. నేర ప్రపంచంతో వారికి ఏర్పడే సంబంధం చుట్టూ సాగే ఎమోషనల్ అండ్ క్రైమ్ డ్రామా.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More