Spider Man Collections: స్పైడర్ మ్యాన్ సినిమాకు ఇండియా ఫిదా.. దిమ్మతిరిగేలా కలెక్షన్లు.. ఫస్ట్ హాలీవుడ్ మూవీగా రికార్డు

Spider Man Brand New Day Collections: మార్వెల్ సిరీస్ లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం 'స్పైడర్‌మాన్: బ్రాండ్ న్యూ డే' ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అతి తక్కువ సమయంలో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హాలీవుడ్ చిత్రంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఇండియన్లు ఫిదా అవుతున్నారు.

Published on: Aug 3, 2026, 12:23:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Spider Man Brand New Day Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాల హవా మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరింది. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్‌ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) భారతీయ థియేటర్లలో కల్లెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూలై 30న విడుదలైన ఈ చిత్రం సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పుతోంది.

స్పైడర్ మ్యాన్ సినిమాకు ఇండియా ఫిదా.. దిమ్మతిరిగేలా కలెక్షన్లు.. ఫస్ట్ హాలీవుడ్ మూవీగా రికార్డు (AP)
స్పైడర్ మ్యాన్ సినిమాకు ఇండియా ఫిదా.. దిమ్మతిరిగేలా కలెక్షన్లు.. ఫస్ట్ హాలీవుడ్ మూవీగా రికార్డు (AP)

4 రోజుల్లో 300 కోట్ల గ్రాస్

ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం స్పైడర్ మ్యాన్ బ్రాడ్ న్యూ డే సినిమా ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఆదివారం (ఆగస్టు 2) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 18,051 షోల ద్వారా ఈ చిత్రం రూ.76 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం వసూళ్లలో 8.2 శాతం పెరుగుదల కనిపించడం విశేషం.

స్పైడర్ మ్యాన్ కలెక్షన్లు ఇలా

  • మొదటి రోజు (గురువారం): రూ.60.60 కోట్లు
  • రెండో రోజు (శుక్రవారం): రూ.49.35 కోట్లు
  • మూడో రోజు (శనివారం): రూ.70.25 కోట్లు
  • నాలుగో రోజు (ఆదివారం): రూ.76.00 కోట్లు

మొత్తం 4 రోజుల ఇండియా నెట్ కలెక్షన్లు : రూ.256.20 కోట్లు

మొత్తం 4 రోజుల ఇండియా గ్రాస్ కలెక్షన్లు : రూ.306.37 కోట్లు

సరికొత్త రికార్డు

భారతదేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రమైనా సరే.. కేవలం ఓపెనింగ్ వీకెండ్ (మొదటి 4 రోజుల్లో) లోనే రూ.300 కోట్ల గ్రాస్ మార్కును దాటడం ఇదే తొలిసారి. ఈ రకంగా చూసుకుంటే స్పైడర్ మ్యాన్ బ్రాడ్ న్యూ డే కొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

ఇండియాలో భారీ ఓపెనింగ్స్ సాధించిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (3 రోజుల్లో రూ.158.65 కోట్లు నెట్), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (3 రోజుల్లో రూ.157.13 కోట్లు నెట్) రికార్డులను కూడా ఈ కొత్త స్పైడర్‌మాన్ చిత్రం తుడిచిపెట్టేసింది.

హిందీలో కూడా

భాషల వారీగా చూస్తే ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ రూ.40 కోట్ల నికర వసూళ్లతో 67 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. హిందీ డబ్బింగ్ వెర్షన్ ఊహించని రీతిలో రూ.29 కోట్లు వసూలు చేస్తూ ఏకంగా 95 శాతం ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. మెట్రో నగరాలు మాత్రమే కాకుండా, ఉత్తరాదిలోని చిన్న పట్టణాల్లో సైతం స్పైడర్‌మాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

మార్వెల్ పాత రికార్డులన్నీ మటాష్

ఇటీవలి కాలంలో విడుదలైన ఇతర మార్వెల్ సినిమాలతో పోలిస్తే స్పైడర్‌మాన్ సృష్టించిన బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. ఫెంటాస్టిక్ ఫోర్ చిత్రం 4 రోజుల్లో కేవలం రూ.22.17 కోట్ల నెట్ (రూ.26.50 కోట్ల గ్రాస్) మాత్రమే సాధించింది. థండర్‌బోల్ట్స్ చిత్రం 4 రోజుల్లో కేవలం రూ.12.05 కోట్ల నెట్ (రూ.14.40 కోట్ల గ్రాస్) వసూలు చేసి నిరాశపరిచింది.

‘నో వే హోమ్’ తర్వాత కథేంటి?

'స్పైడర్‌ మ్యాన్: నో వే హోమ్' సంఘటనలు జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా కథ ప్రారంభమవుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ చేసిన మాయాజాలం వల్ల పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) ఉనికిని అతని ప్రేయసి ఎంజే (జెండయా), ప్రాణస్నేహితుడు నెడ్ (జాకోబ్ బటాలన్) సహా ప్రపంచమంతా మరచిపోతుంది.

తనను ఎవరూ గుర్తుపట్టని ఒంటరి జీవితాన్ని గడుపుతూ న్యూయార్క్ నగరంలో స్పైడర్‌ మ్యాన్గా నేరాలను అరికడుతుంటాడు పీటర్. అయితే నగరంలో ఊహించని నేరాలు జరగడం, పీటర్ శరీరంలో వింత మార్పులు చోటుచేసుకోవడంతో ప్రపంచానికి మళ్లీ ముప్పు వాటిల్లుతుంది. ఈ క్లిష్ట సమయంలో పీటర్‌కు సాయం చేయడానికి 'ది పనీషర్' ఫ్రాంక్ కాజిల్ (జాన్ బెర్న్‌థాల్), 'హల్క్' బ్రూస్ బేనర్ (మార్క్ రుఫాలో) రంగంలోకి దిగుతారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More