Spider-Man Box Office: స్పైడర్-మ్యాన్ బాక్సాఫీస్ సునామీ.. తొలి రోజే ఇండియాలో ఆల్ టైమ్ రికార్డు.. తెలుగులోనూ భారీగా..
Spider-Man Box Office: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తొలి రోజే ఇండియాలో బాక్సాఫీస్ సునామీ క్రియేట్ చేసింది. ఈ మధ్యే వచ్చిన ది ఒడిస్సీ మూవీ రికార్డును బీట్ చేసి.. ఇండియాలో తొలి రోజు ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది.
Spider-Man Box Office: మార్వెల్ లవర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) థియేటర్లలోకి అడుగుపెడుతూనే బాక్సాఫీస్ దగ్గర ఊహకందని విధ్వంసం సృష్టించింది. హాలీవుడ్ యంగ్ స్టార్ టామ్ హాలండ్ (Tom Holland) కథానాయకుడిగా నటించిన ఈ సూపర్‌హీరో ఎపిక్, ఇండియాలో మొదటిరోజే ఏకంగా రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆల్‌టైమ్ హిస్టారికల్ రికార్డు నమోదు చేసింది.

ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా సాధించని స్థాయిలో ఈ ఓపెనింగ్స్ రావడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. మెట్రో నగరాల నుంచి బి, సి సెంటర్ల వరకు ప్రతిచోటా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ మ్యాన్ హవా
తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీకి ఉన్న దిమ్మతిరిగే క్రేజ్ మరోసారి నిరూపితమైంది. నైజాం, ఆంధ్రా వ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా రూ. 9 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
డబ్బింగ్ వర్షన్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో మొదటి వీకెండ్‌లో ఈ నంబర్లు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల రచ్చ
అంతర్జాతీయంగా కూడా 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సరికొత్త సునామీ సృష్టిస్తోంది. కేవలం నార్త్ అమెరికా ప్రీవ్యూ షోల ద్వారానే 70 నుంచి 75 మిలియన్ డాలర్లు రాబట్టే దిశగా దూసుకెళ్తోంది.
ఇక ఓపెనింగ్ వీకెండ్ నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 325 మిలియన్ డాలర్లు (రూ. 2,700 కోట్లకు పైగా) గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అదిరిపోయిన మేకింగ్ - పీటర్ పార్కర్‌గా టామ్ హాలండ్ ర్యాంపేజ్
'షాంగ్-చీ' ఫేమ్ డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ (Destin Daniel Cretton) ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. పీటర్ పార్కర్‌గా టామ్ హాలండ్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, ఎంజేగా జెండయా (Zendaya) నటన, అలాగే కొత్తగా జాయిన్ అయిన సడీ సింక్ (Sadie Sink) పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మైఖేల్ గియాచినో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
టాలీవుడ్ సినిమాలకు స్పైడర్ మ్యాన్ పెద్ద గండం
స్పైడర్ మ్యాన్ తీసుకొచ్చిన ఈ బాక్సాఫీస్ సునామీ.. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న తెలుగు సినిమాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.
ఈ వారంలో బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్న 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story), 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram), అలాగే 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton’s 3rd Law) చిత్రాల కలెక్షన్లకు స్పైడర్ మ్యాన్ పెద్ద గండంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వరల్డ్‌వైడ్‌గా విమర్శకుల నుంచి 90 శాతానికి పైగా పాజిటివ్ రేటింగ్స్ సొంతం చేసుకున్న ఈ మార్వెల్ బ్లాక్‌బస్టర్, లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


