Top OTT: ఓటీటీ వార్.. ఇండియాలో టాప్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదో తెలుసా? ప్రైమ్ వీడియో వర్సెస్ నెట్‌ఫ్లిక్స్
Top OTT: ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల వెలువడిన మార్కెట్ షేర్ నివేదికల ప్రకారం ప్రైమ్ వీడియో వర్సెస్ నెట్‌ఫ్లిక్స్ పోరు మరింత హోరాహోరీగా సాగింది. ఇండియాలో డామినెన్స్ కోసం ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సై అంటే సై అంటున్నాయి. పూర్తి లిస్ట్ మీ కోసం.
Top OTT: భారతదేశంలో డిజిటల్ వినోద రంగం మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్ లభ్యత, సరసమైన డేటా ప్యాక్‌లు, స్మార్ట్ టీవీల వినియోగం పెరగడంతో డిజిటల్ వీక్షకులు సాంప్రదాయ టీవీల నుంచి ఓటీటీ (OTT) వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ మార్కెట్లో గ్లోబల్, రీజినల్ ఓటీటీ దిగ్గజాల మధ్య తీవ్రమైన ‘ఓటీటీ వార్’ (OTT War) నడుస్తోంది.

టాప్ లో ప్రైమ్ వీడియో
తాజాగా వెలువడిన మార్కెట్ షేర్ డేటా ప్రకారం.. డిజిటల్ స్ట్రీమింగ్ రేసులో అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ ప్లేస్ లో నిలిచింది. తన మెయిన్ కాంపిటీటర్ నెట్‌ఫ్లిక్స్ ను ప్రైమ్ వీడియో ఓటీటీ వెనక్కి నెట్టింది. గ్లోబల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దానికి అత్యంత సమీపంలోకి వచ్చి, చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఓటీటీ మార్కెట్ షేర్ వివరాలు
- అమెజాన్ ప్రైమ్ వీడియో (23%): భారతదేశ ఓటీటీ రంగంలో 23 శాతం వాటాతో ప్రైమ్ వీడియో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- నెట్‌ఫ్లిక్స్ (22%): ప్రైమ్ వీడియోకు గట్టి పోటీ ఇస్తూ 22 శాతం మార్కెట్ షేర్‌తో నెట్‌ఫ్లిక్స్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
- జియోహాట్‌స్టార్ (19%): క్రీడలు, రీజినల్ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్ 19 శాతంతో మూడో స్థానంలో ఉంది.
- ఆపిల్ టీవీ ప్లస్ (17%): సైలెంట్‌గా విస్తరిస్తూ ఆపిల్ టీవీ ప్లస్ 17 శాతం వాటాతో నాలుగో స్థానాన్ని సాధించింది.
- జీ5 (9%): ప్రాంతీయ భాషా చిత్రాలు, సీరియళ్లతో జీ5 9 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.
- సోనీలివ్ (4%): ప్రత్యేకమైన స్పోర్ట్స్, వెబ్ సిరీస్‌లతో సోనీలివ్ 4 శాతం వాటాతో నిలిచింది.
- ఇతర ప్లాట్‌ఫామ్‌లు (6%): ఆహా, ఈటీవీ విన్ వంటి ఇతర ప్రాంతీయ డిజిటల్ వేదికలు ఉమ్మడిగా 6 శాతం వాటాను పంచుకున్నాయి.
ప్రైమ్ వీడియో లీడ్‌లో ఉండటానికి కారణాలు
అమెజాన్ ఈ-కామర్స్ షాపింగ్‌తో కూడిన ‘ప్రైమ్ మెంబర్‌షిప్’ బండిలింగ్ ఆఫర్ ఈ ప్లాట్‌ఫామ్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్. దీనికి తోడు టాలీవుడ్, కోలీవుడ్ వంటి దక్షిణాది ప్రాంతీయ చిత్రాలు థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ప్రైమ్ వీడియోలోకి రావడం భారతీయ కుటుంబాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
నెట్‌ఫ్లిక్స్ జంబో గ్రోత్ వెనుక నిజాలు
ఒకప్పుడు కేవలం ప్రీమియం క్లాస్ వర్గానికే పరిమితమైన నెట్‌ఫ్లిక్స్.. ఇండియాలో రూ.149 మొబైల్ ప్లాన్ పరిచయం చేసిన తర్వాత మాస్ ఆడియన్స్‌కు దగ్గరైంది. పాన్-ఇండియా బిగ్ బడ్జెట్ సౌత్ సినిమాలు, అంతర్జాతీయ ఒరిజినల్ సిరీస్‌లతో పాటు ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్లతో నెట్‌ఫ్లిక్స్ వేగంగా 22 శాతానికి చేరుకుంది.
జియోహాట్‌స్టార్ స్పోర్ట్స్ మ్యాజిక్
లైవ్ క్రికెట్, ఐపీఎల్ ప్రసారాలు, రోజువారీ సీరియళ్ల క్యాచ్-అప్ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్ కోట్లాది మంది యూజర్లకు చేరువైంది. టెలికామ్ ఆఫర్లతో డేటా కనెక్టివిటీ ఇచ్చి సబ్‌స్క్రైబర్ల బేస్‌ను కాపాడుకుంటోంది.
ఆపిల్ టీవీ ప్లస్, జీ5 & సోనీలివ్ స్థానాలు
క్వాలిటీ కంటెంట్‌తో ఆపిల్ టీవీ ప్లస్ 17 శాతానికి ఎగబాకడం ఆశ్చర్యపరిచే విషయమే. మరోవైపు స్థానిక కంటెంట్‌ను ఇష్టపడే వీక్షకుల కోసం జీ5 (9%), సోనీలివ్ (4%) తమ సొంత లైబ్రరీలతో డిజిటల్ రేసులో నిలిచాయి.
కంటెంట్ క్వాలిటీగా ఉంటేనే
ఇండియన్ ఓటీటీ మార్కెట్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరల కంటే ‘కంటెంట్ క్వాలిటీ’, 'ప్రాంతీయ భాషల అనువాదం' ప్రాధాన్యత పెరిగింది. కేవలం చౌకైన ప్లాన్లు ఇచ్చినంత మాత్రాన వీక్షకులు ఓటీటీకి అతుక్కుపోరు.
ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మొదటి రెండు స్థానాల్లో ఉండటానికి ప్రధాన కారణం డిజిటల్ యూజర్ల అభిరుచులకు తగినట్లుగా మైక్రో-నిచ్ కంటెంట్‌ను (తెలుగు క్రైమ్ థ్రిల్లర్లు, మలయాళ డబ్బింగ్ సినిమాలు) క్యూరేట్ చేయడమే. రాబోయే కాలంలో ఓటీటీ వేదికల మధ్య యుద్ధం కేవలం చందాదారుల సంఖ్యపైనే కాకుండా.. ఎవరు అత్యుత్తమ స్థానిక కంటెంట్ ఇస్తున్నారనే పాయింట్‌పైనే తేలనుందని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


