Crime Thriller Web Series: ప్రైమ్ వీడియో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది.. ట్రైలర్ రిలీజ్
Crime Thriller Web Series: ప్రైమ్ వీడియో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వదంతి రెండో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆగస్ట్ 7 నుంచి ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఆ విశేషాలేంటో చూడండి.
Crime Thriller Web Series: ఒక మర్డర్ మిస్టరీ కేస్ క్లోజ్ అయిన తర్వాత అసలైన విచారణ మొదలైతే ఎలా ఉంటుంది? ఓటీటీ ప్రియులను ఊపేసిన మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'వదంతి' (Vadhandhi) సీజన్ 2 తో మళ్లీ మన ముందుకు వచ్చేస్తోంది. 'వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి' (Vadhandhi Season Two: The Mystery of Mani) పేరుతో తెరకెక్కించిన ఈ సీట్ ఎడ్జ్ డ్రామా ఆగస్టు 7, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది. పవర్‌ఫుల్ యాక్టర్ ఎమ్. శశికుమార్ ఇందులో ఎస్ఐ మూసా రజాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
"కేస్ క్లోజ్ అయిన తర్వాతే అసలైన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది" అని ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మదురై జల్లికట్టు బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ డ్రామా
మదురై బ్యాక్‌డ్రాప్‌లో సాంప్రదాయ జల్లికట్టు పండుగ వాతావరణంలో ఈ సీజన్ కథ సాగుతుంది. ఒక నేషనల్ హైవే నిర్మాణం కోసం నేలను తవ్వుతున్న సమయంలో ఒక పాత అస్థిపంజరం బయటపడటంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
పొలిటికల్ ప్రెజర్, మీడియా హంగామా మధ్యలో ఆ నిజమైన నేరస్థుడిని పట్టుకోవడానికి ఎస్ఐ మూసా రజా చేసే విచారణే ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణ. పదేళ్ల క్రితం నాటి ఆ రహస్య అస్థిపంజరం మిస్టరీ చివరికి 'మణి' అనే ఖైదీ దగ్గరికి ఎలా తీసుకెళ్లిందో దర్శకుడు మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో తీర్చిదిద్దారు.
ఎస్.జే. సూర్య మొదటి సీజన్ నుంచి శశికుమార్ వరకు..
2022లో ఎస్.జే. సూర్య హీరోగా వచ్చిన 'వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని' మొదటి సీజన్ ఓటీటీలో సంచలన విజయం సాధించింది. 'విక్రమ్ వేద' ఫేమ్ పుష్కర్ - గాయత్రి తమ హోమ్ బ్యానర్ వాల్‌వాచర్ ఫిల్మ్స్‌పై నిర్మించిన ఈ ఫ్రాంచైజ్‌కు ఆండ్రూ లూయిస్ (Andrew Louis) క్రియేటర్, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
వదంతులు, నిజాల మధ్య ఉన్న గీతను సస్పెన్స్‌తో బ్లర్ చేస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడంలో ఈ మేకర్స్ సిద్ధహస్తులు. ఈ రెండో సీజన్‌లో అపర్ణా దాస్, అనఘ, వివేక్ ప్రసన్న, రేవతి శర్మ, యశ్వంత్ కీలక పాత్రల్లో నటించారు.
సౌత్ ఇండియా నుంచి వస్తున్న ఇంటెన్స్ యాక్షన్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌లకు నేషనల్ లెవెల్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆగస్టు 7న ప్రైమ్ వీడియోలోకి రాబోతున్న ఈ 8 ఎపిసోడ్ల థ్రిల్లర్ సిరీస్ ఓటీటీ వీక్షకులకు మరో సరికొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


