Heartbeat season 3 OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ తమిళ వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేసింది..తెలుగులోనూ స్ట్రీమింగ్..మస్ట్ వాచ్!
Heartbeat season 3 OTT: ఓటీటీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మెడికల్ డ్రామా సీరిస్ ‘హార్ట్ బీట్’ నుంచి మూడో సీజన్ వచ్చేసింది. తెలుగులోనూ వస్తున్న ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ రెండు సీజన్లలో ఏం జరిగింది? మూడో సీజన్ లో ఏం ఉండబోతుందో? ఇక్కడ చూసేయండి.
Heartbeat season 3 OTT: ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో హాలీవుడ్ హిట్ సిరీస్ 'గ్రేస్ అనాటమీ' తరహాలోనే ఆర్కే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తమిళ వెబ్ సిరీస్ 'హార్ట్ బీట్' (Heart Beat) గత రెండు సీజన్లతో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు మరింత ఉత్కంఠభరితమైన కథనంతో 'హార్ట్ బీట్ సీజన్ 3' ఓటీటీలోకి వచ్చేసింది.

హార్ట్ బీట్ సీజన్ 3 ఓటీటీ
పాపులర్ వెబ్ సిరీస్ ‘హార్ట్ బీట్’ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ షురూ అయింది. ఇవాళ (జూలై 30, 2026) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. ఇక ప్రతి గురువారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఈ సీజన్ కూడా 100 ఎపిసోడ్లు సాగనుందని తెలిసింది. సీజన్ 3 తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
గతంలో ఏం జరిగింది?
- సీజన్ 1: ప్రసిద్ధ సర్జన్ డాక్టర్ రాధి త్యాగరాజన్ (అనుమోల్) కుమార్తె రీనా (దీపా బాలు) ఆర్కే హాస్పిటల్‌లో సర్జికల్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడంతో కథ ప్రారంభమవుతుంది. తేజు, నవీన్, రాకీ, గుణలతో కలిసి పని చేస్తూ ఆసుపత్రి ఒత్తిడిని తట్టుకోవడమే కాకుండా, తన తల్లి రాధితో ఉన్న క్లిష్టమైన గతాన్ని రీనా తెలుసుకుంటుంది.
- సీజన్ 2: డాక్టర్ రాధి తిరిగి హాస్పిటల్ బాధ్యతల్లోకి రావడం, అర్జున్ సీఈఓగా పగ్గాలు చేపట్టాక రీనా ఎదుర్కొన్న సవాళ్లు కథను మలుపు తిప్పాయి. వీటికి తోడు రాధి పాత ప్రేమికుడు, రీనా బయోలాజికల్ ఫాదర్ అయిన డాక్టర్ విజయ్ (కార్తీక్ కుమార్) ఎంట్రీ ఇవ్వడంతో తీవ్రమైన భావోద్వేగ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
సీజన్ 3 లో కొత్త మలుపులు
హార్ట్ బీట్ మూడో సీజన్ ఆర్కే హాస్పిటల్‌లోని సీనియర్ డాక్టర్లు కొత్త తరం ఇంటర్న్‌లకు మార్గదర్శకత్వం వహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రి రాజకీయం, ప్రొఫెషనల్ శత్రుత్వాలు, స్నేహాలు, ప్రేమ బంధాలు మరింత ఇంటెన్స్‌గా మారనున్నాయి. ఈ సీజన్‌లో ప్రధాన పాత్రల్లో ఒకటైన డాక్టర్ తేజశ్రీ (తేజు - యోగలక్ష్మి రమేష్) పాత్ర నిష్క్రమించడం కథనంలో ఒక పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టనుంది.
దీపా బాలు (డాక్టర్ రీనా), అనుమోల్ (డాక్టర్ రాధి), చారుకేష్ శేఖర్ (అర్జున్), కార్తీక్ కుమార్ (డాక్టర్ విజయ్), శబరీష్ (రాకీ), ఆర్‌జి రామ్ (నవీన్), సర్వా (గుణ), పడీన్ కుమార్ (అనిత), గురు లక్ష్మణ్ (ప్రీతమ్) తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. రాహుల్ రాజశేఖరన్, అక్షత దాస్ కొత్త డాక్టర్లుగా చేరారు.
పర్పెక్ట్ ఛాయిస్
దీపక్ సుందర్‌రాజన్, అబ్దుల్ కబీజ్, చిదంబరం మణివణ్ణన్ క్రియేట్ చేసిన ఈ హార్ట్ బీట్ సిరీస్‌ను 'ఏ టెలి ఫ్యాక్టరీ' బ్యానర్‌పై పద్మిని వేలు, రాజవేలు నిర్మించారు. శరణ్ రాఘవన్ నేపథ్య సంగీతం అందించాడు.
సౌత్ ఓటీటీ స్పేస్‌లో పూర్తిస్థాయి మెడికల్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తుండటంతో, ప్రాంతీయ సరిహద్దులు దాటి ఈ సిరీస్‌కు వ్యూయర్‌షిప్ లభించే అవకాశం ఉంది. లైఫ్ అండ్ డెత్ డ్రామాలు, ప్రొఫెషనల్ ఎథిక్స్ వర్సెస్ పర్సనల్ ఎమోషన్స్ కలగలిపిన కథనాలు ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు 'హార్ట్ బీట్ 3' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


