Heart Beat 3 Teaser: మరో 100 ఎపిసోడ్లు రెడీ.. సూపర్ హిట్ మెడికల్ డ్రామా హార్ట్ బీట్ సీజన్ 3 టీజర్ రిలీజ్.. ట్విస్ట్ ఇదే

Heart Beat 3 Teaser: జియోహాట్‌స్టార్ ఓటీటీ సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ హార్ట్ బీట్ సీజన్ 3 వచ్చేస్తోంది. జులై 30న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులోని ట్విస్ట్ ఆసక్తి రేపుతోంది.

Published on: Jul 11, 2026, 07:51:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Heart Beat 3 Teaser: యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా జియో హాట్‌స్టార్‌లో దుమ్మురేపిన మెడికల్ వెబ్ సిరీస్ 'హార్ట్ బీట్'. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా సీజన్ 3 రిలీజ్ డేట్ కొన్ని రోజుల కిందటే అఫీషియల్‌గా వచ్చేసింది. జులై 30 నుంచి ఈ సెన్సేషనల్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు.

Heart Beat 3 Teaser: మరో 100 ఎపిసోడ్లు రెడీ.. సూపర్ హిట్ మెడికల్ డ్రామా హార్ట్ బీట్ సీజన్ 3 టీజర్ రిలీజ్.. ట్విస్ట్ ఇదే
Heart Beat 3 Teaser: మరో 100 ఎపిసోడ్లు రెడీ.. సూపర్ హిట్ మెడికల్ డ్రామా హార్ట్ బీట్ సీజన్ 3 టీజర్ రిలీజ్.. ట్విస్ట్ ఇదే

హార్ట్‌ బీట్ సీజన్ 3 లో మేజర్ ట్విస్ట్ ఇదే!

సౌత్ ఇండియాలో ఇలాంటి ప్యూర్ మెడికల్ డ్రామాలు రావడం చాలా అరుదు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ వచ్చిన ఈ హార్ట్ బీట్ వెబ్ సిరీస్.. గత రెండు సీజన్లు ఆర్కే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ రైడ్‌లా సాగాయి. డాక్టర్ రీనా, డాక్టర్ రధి మధ్య ఉన్న రిలేషన్‌షిప్, ఎమోషన్స్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. మెడికల్ ప్రొఫెషన్‌లో ఉండే సవాళ్లు, కొత్తగా చేరిన ఇంటర్న్ డాక్టర్ల పర్సనల్ లైఫ్‌లో ఉండే టెన్షన్స్.. ఇలా ప్రతిదీ నేచురల్‌గా చూపించడంతో ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది.

"ఒక ప్రపంచం రెండుగా విడిపోయింది.. కానీ గుండెచప్పుడు మాత్రం ఒక్కటే" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ వెనుక చాలా పెద్ద స్టోరీనే దాగి ఉంది. రీసెంట్ ఎపిసోడ్స్ బట్టి చూస్తే, మెయిన్ లీడ్ డాక్టర్ రీనా తన కెరీర్ కోసం ఆర్కే హాస్పిటల్ నుంచి ఏఎమ్ (AM) హాస్పిటల్‌కు షిఫ్ట్ అయింది. పాత హాస్పిటల్ ఫ్రెండ్స్‌ను, మెమొరీస్‌ను వదిలేసి కొత్త చోట జాయిన్ అవ్వడం సిరీస్‌లో క్రూషియల్ పాయింట్ కాబోతోంది.

దీంతో ఈసారి కథ రెండు హాస్పిటల్స్ చుట్టూ తిరగబోతోందని క్లియర్‌గా అర్థమవుతోంది. అసలు దీపా బాలు (డాక్టర్ రీనా) ఈ సీజన్‌లో ఉంటుందా లేదా అనే డౌట్స్ ఫ్యాన్స్‌లో మొన్నటిదాకా బాగా ఉండేవి. ఆ రూమర్స్‌కి చెక్ పెడుతూ, తను కచ్చితంగా సీజన్ 3లో దుమ్మురేపబోతోందని జియో హాట్‌స్టార్ టీమ్ కన్ఫర్మ్ చేసింది. ఆమెతో పాటు మలయాళీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుమోల్ (డాక్టర్ రధి), కార్తీక్ కుమార్, చారుకేశ్ మళ్లీ తమ పాత క్యారెక్టర్స్‌లో అదరగొట్టనున్నారు.

200 ఎపిసోడ్స్‌తో అరుదైన రికార్డు..

ఒరిజినల్‌గా తమిళంలో స్టార్ట్ అయిన ఈ సిరీస్, డబ్బింగ్ వర్షన్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చేసింది. డైరెక్టర్ దీపక్ సుందర్రాజన్ ఈ స్టోరీని చాలా గ్రిప్పింగ్‌గా, సాగదీత లేకుండా తెరకెక్కించాడు. సీజన్ 1, సీజన్ 2 కలిపి ఏకంగా 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుని.. ఓటీటీ స్పేస్‌లో ఒక సాలిడ్ రికార్డ్ సెట్ చేసింది ఈ స్పెషల్ వెబ్ సిరీస్. ఇప్పుడు మరో 100 ఎపిసోడ్లు రెడీ అవుతున్నాయి.

సీజన్ 3లో ఏఎమ్ హాస్పిటల్ స్టాఫ్‌తో పాటు కొత్త ఇంటర్న్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డాక్టర్ రీనా, అర్జున్ మధ్య లవ్ ట్రాక్ ఏమవుతుంది? తన బయోలాజికల్ పేరెంట్స్ అయిన డాక్టర్ రధి, డాక్టర్ విజయ్‌లతో రీనా రిలేషన్ మళ్లీ ట్రాక్‌లో పడుతుందా అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ కొత్త సీజన్ నడవబోతోంది. అద్భుతమైన బీజీఎమ్, క్లీన్ ఫ్యామిలీ స్టోరీ ఉండటంతో ఈ క్రేజీ సిరీస్ జులై 30న బ్లాక్‌బస్టర్ వ్యూయర్‌షిప్ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More