DQ41: క్లాసిక్ టైటిల్‌తో దుల్కర్ సల్మాన్ మూవీ-యూనిఫామ్‌లో పూజా హెగ్డే-టాలీవుడ్ లో బుట్టబొమ్మ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్!

DQ41: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మూవీకి క్లాసిక్ టైటిల్ అనౌన్స్ చేశారు. సినిమా పేరుతో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంతో పూజా హెగ్డే టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందా? 

Published on: Jul 10, 2026, 12:13:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

DQ41: తెలుగు ప్రేక్షకులకు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) అంటే కేవలం ఒక డబ్బింగ్ హీరో కాదు. ‘మహానటి’, ‘సీతా రామం’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోలకు సమానమైన మార్కెట్, అపారమైన లేడీ ఫాలోయింగ్‌ను అతను సొంతం చేసుకున్నాడు. తాజాగా తన కెరీర్‌లో 41వ మూవీ టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు.

క్లాసిక్ టైటిల్‌తో దుల్కర్ సల్మాన్ మూవీ-యూనిఫామ్‌లో పూజా హెగ్డే (x/dulQuer)
క్లాసిక్ టైటిల్‌తో దుల్కర్ సల్మాన్ మూవీ-యూనిఫామ్‌లో పూజా హెగ్డే (x/dulQuer)

శ్రీ శ్రీ

దుల్కర్ సల్మాన్ కెరీర్ లో 41వ (DQ41) చిత్రంగా తెరకెక్కుతున్న మల్టీలింగ్వల్ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఇవాళ (జూలై 10) అఫీషియల్‌గా ప్రకటించారు. డెబ్యూ డైరెక్టర్ రవి నేలకుడితి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ’ (#Sri Sri) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ప్రొడక్షన్ హౌస్ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ (SLV Cinemas) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ప్రస్తుతం గూగుల్‌లో DQ41 title Sri Sri update కోసం నెటిజన్లు విపరీతంగా వెతుకుతున్నారు. అయితే ఈ పోస్టర్, టైటిల్ వెనుక ట్రేడ్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

స్కూల్ యూనిఫామ్ లుక్

ప్రస్తుతం విడుదలైన శ్రీ శ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఇదొక ప్యూర్ అండ్ క్లాసిక్ క్యాంపస్ లవ్ స్టోరీ అని స్పష్టంగా అర్థమవుతోంది. పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ యూనిఫామ్స్ ధరించి ఒక టెర్రస్ గోడపై కూర్చుని నవ్వుకుంటూ కనిపించారు.

క్లాసిక్ రొమాన్స్

టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతా వైలెన్స్, యాక్షన్, రా అండ్ రస్టిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి టైమ్‌లో దుల్కర్ సల్మాన్ మళ్లీ తన స్ట్రాంగ్ జోనర్ అయిన ‘క్లాసిక్ రొమాన్స్’ వైపు అడుగులు వేయడం ఒక తెలివైన వ్యూహం. టైటిల్ ‘శ్రీ శ్రీ’ అని పెట్టడం వెనుక తెలుగు నేటివిటీ, ఒక పొయెటిక్ టచ్ దాగుంది.

అయితే ఇద్దరు మెచ్యూర్డ్ యాక్టర్లను యూనిఫామ్‌లో చూపించడాన్ని బట్టి చూస్తే.. కథలో చైల్డ్‌హుడ్ మెమొరీస్ లేదా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చాలా కీలకంగా ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్.

పూజా హెగ్డే టాలీవుడ్ రిటర్న్

తెలుగులో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ ‘బుట్టబొమ్మ’గా వెలిగిన పూజా హెగ్డే (Pooja Hegde).. 2022లో వచ్చిన ‘ఆచార్య’ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో మెయిన్ లీడ్ రోల్ చేయలేదు. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తనకు టాలీవుడ్‌లో కంబ్యాక్ ఇవ్వడానికి ‘శ్రీ శ్రీ’ ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ కానుంది.

దుల్కర్ తో తొలిసారి

తమిళంలో సీఎం విజయ్ (Thalapathy Vijay) చివరి చిత్రంగా వస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan), హిందీలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రాలతో పూజా బిజీగా గడిపింది. ఇప్పుడు దుల్కర్‌తో పూజా జోడీ కట్టడం ఇదే తొలిసారి. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ క్లాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి ఒక పెద్ద ‘లీడ్ మ్యాగ్నెట్’గా మారే అవకాశం ఉంది.

జీవీ ప్రకాష్ మ్యూజిక్ మ్యాజిక్

శ్రీ శ్రీ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌కు ఇది ప్రతిష్టాత్మకమైన 10వ చిత్రం. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ కూడా సైలెంట్‌గా పూర్తయింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతాన్ని అందిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి కూడా జీవీ ప్రకాష్‌నే మ్యూజిక్ ఇస్తుండటం విశేషం.

దుల్కర్ చేతిలో ప్రస్తుతం మలయాళంలో ఓనమ్ పండుగకు రిలీజ్ కాబోతున్న ‘ఐ యామ్ గేమ్’ (I'm Game) తో పాటు, తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’, ఈ సరికొత్త ‘శ్రీ శ్రీ’ సినిమాలు ఉన్నాయి. కమర్షియల్ హంగులతో సంబంధం లేకుండా ప్యూర్ కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న ‘శ్రీ శ్రీ’ సినిమా.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More