దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తారలో శృతి హాసన్.. నోట్లో సిగరెట్‌తో బోల్డ్ ఫస్ట్ లుక్ రిలీజ్
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తార మూవీ నుంచి శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నోట్లో సిగరెట్ తో బోల్డ్ లుక్ లో ఆమె కనిపించడం చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇప్పుడీ పోస్టర్ వైరల్ అవుతోంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా నుంచి బుధవారం (జనవరి 28) ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇందులో ప్రముఖ నటి శృతి హాసన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె బర్త్‌డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసింది. వీటిలో ఒకదాంట్లో ఆమె నోట్లో సిగరెట్ తో కనిపించడం గమనార్హం.

సైన్స్ టీచర్‌గా శృతి..
యువ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి ప్రకటనతో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి శృతి హాసన్ రాకతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో శృతి హాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఆమె ఒక బోల్డ్ అండ్ డైనమిక్ సైన్స్ టీచర్‌గా కనిపిస్తోంది. సాత్విక వీరవల్లి అనౌన్స్‌మెంట్ వీడియోను, ఈ పోస్టర్లను గమనిస్తే.. చిన్నారి కలలను సాకారం చేసుకునేందుకు ప్రోత్సహించే గురువు పాత్రలో శృతి కనిపించనున్నట్లు అర్థమవుతోంది.
ఆకాశంలో ఒక తార భారీగా..
ఈ ఆకాశంలో ఒక తార సినిమాను లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది సమ్మర్ లో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
గత సోమవారం (జనవరి 19) ఈ సినిమాలో హీరోయిన్ సాత్విక వీరవల్లి క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌ను గమనిస్తే.. సరైన రోడ్లు కూడా లేని ఓ మారమూల పల్లె నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఆకాశంలో తారలను చేరుకోవాలంటూ కనే కలలను కథగా చూపించారు. ప్రకాష్ మనసుకు హత్తకునే బీజీఎం ఇవ్వగా.. సాత్విక చాలా అందంగా కనిపించింది.
వైవిధ్యమైన, అర్థవంతమైన కథలను ఎంచుకునే దుల్కర్ సల్మాన్ అభిరుచికి తగ్గట్లు, డైరెక్టర్ పవన్ సాధినేని క్రియేటివిటీ కలిసి ఒక ప్రత్యేకమైన, గుర్తుండిపోయే సినిమాగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా రూపొందుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


