OTT Releases: ఈ వారం ఓటీటీ రచ్చ- దీవానా నుంచి గట్ట కుస్తీ 2 వరకు- 30కి పైగా సినిమాలు- ఇవి చాలా స్పెషల్-ఓ లుక్కేయండి!
OTT Releases: జూలై లాస్ట్ వీక్ ఓటీటీ ప్రియులకు అసలైన వినోదాల విందు అందించబోతోంది. నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ విన్, జీ5, ప్రైమ్ వీడియోలలో 'దీవానా', 'గట్ట కుస్తీ 2', 'సెకండ్ మ్యారేజ్' సహా 30 కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఇందులో స్పెషల్ సినిమాలున్నాయి.
OTT Releases: తెలుగు డిజిటల్ ప్రేక్షకులకు జూలై చివరి వారం పండగే అని చెప్పాలి. విభిన్న జోనర్లలో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న బ్లాక్‌బస్టర్ల నుంచి నేరుగా డిజిటల్ అరంగేట్రం చేస్తున్న వెబ్ సిరీస్‌ల వరకు భారీ కంటెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెడుతోంది.

అన్ని ఓటీటీల్లో
నెట్‌ఫ్లిక్స్ (Netflix), ఆహా (Aha), జీ5 (ZEE5), ఈటీవీ విన్ (ETV Win), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికలుగా ఈ వారం స్ట్రీమింగ్ కానున్న ప్రధాన చిత్రాలు, స్పెషల్ సినిమాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.
తెలుగు సినిమాలు & సిరీస్‌లు
తెలుగు ఆడియన్స్ కోసం ఈ వారం ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్ సిద్ధంగా ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చిన యంగ్ లవ్ డ్రామా 'దీవానా' (Deewana) జూలై 30న ఆహా గోల్డ్ యూజర్లకు, జూలై 31 నుంచి మిగిలిన అందరికీ అందుబాటులోకి వస్తుంది. నిజ జీవిత స్కామ్ ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ సిరీస్ 'ఆజాదీ 501' (Azadi 501) జూలై 29న ఆహాలో ప్రసారం కానుంది
రావు బహదూర్ కూడా
ఈటీవీ విన్ వేదికగా రవి మహదాస్యం, మౌనిక రెడ్డి జంటగా తెరకెక్కిన 'సెకండ్ మ్యారేజ్' (Second Marriage) జూలై 30న రిలీజ్ అవుతుండగా, సీనియర్ నటుడు శ్రీకాంత్ లీగల్ డ్రామా 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord) జూలై 31 నుంచి జీ5లో సందడి చేయనుంది. వీటితో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'రావు బహదూర్' (Rao Bahadur) కూడా జూలై 31న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
పాన్-ఇండియా హిట్స్
తమిళ్, మలయాళంలో సూపర్ హిట్ అయి తెలుగు డబ్బింగ్‌తో వస్తున్న సినిమాలు ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ కామెడీ హిట్ మూవీ 'గట్ట కుస్తీ 2' (Gatta Kusthi 2) జూలై 31న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా మల్టీ లాంగ్వేజస్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మైండ్ గేమ్‌లతో సాగే సైకో థ్రిల్లర్ 'బాలన్: ది బాయ్' (Balan: The Boy) జీ5లో, మధుబాల ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ డ్రామా 'చిన్న చిన్న ఆశై' (Chinna Chinna Aasai) జూలై 28న జియో హాట్‌స్టార్, ఆహాలో అందుబాటులోకి రానున్నాయి. బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ జూలై 31న జీ5లోకి రానుంది.
ఆ సిరీస్ సీజన్ 3
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన మెడికల్ డ్రామా 'హార్ట్ బీట్ సీజన్ 3' (Heart Beat S3) జూలై 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగులోనూ ప్రసారం కానుంది. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీ 'లవ్ ఓ లవ్' (Love Oh Love) జూలై 31న ప్రైమ్ వీడియోలోకి వస్తుండగా, యానిమేటెడ్ సీరీస్ 'ది లెజెండ్ ఆఫ్ కర్ణ' (The Legend of Karna) సోనీ లివ్‌లో రిలీజ్ అవుతోంది.
హాలీవుడ్ & గ్లోబల్ కంటెంట్
ఇంటర్నేషనల్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం గ్లోబల్ హిట్ సీక్వెల్ 'ది డెవిల్ వేర్స్ ప్రాడా 2' (The Devil Wears Prada 2) జూలై 29న జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీలో విడుదలవుతోంది. క్రైమ్ డాక్యుమెంటరీ ప్రియుల కోసం 'ది ఐడాహో మర్డర్స్' (The Idaho Murders) నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
బ్యాట్‌మాన్ ప్రేమికుల కోసం 'బ్యాట్‌మాన్: కేప్డ్ క్రూసేడర్ సీజన్ 3' జూలై 31న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్నాయి. థ్రిల్లర్స్, కామెడీ, ఎమోషనల్ డ్రామాస్ అన్ని వర్గాల వారికి తగ్గట్టుగా ఈ వారం ఓటీటీ లైనప్ అదిరిపోయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


