This Week OTT: ఈ వారం ఓటీటీ సినిమాలు-నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఏకంగా 20+ మూవీస్-ఈ 5 క్రైమ్ థ్రిల్లర్స్ మిస్సవొద్దు!

This Week OTT: ఈ వారం ఓటీటీ వీక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్, సోనీలివ్, జియోహాట్‌స్టార్ వంటి ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. అసలు మిస్ కాకూడని 5 క్రైమ్ థ్రిల్లర్లు  కూడా ఉన్నాయి. ఓ లుక్కేయండి.

Published on: Jul 21, 2026, 13:50:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

This Week OTT: ప్రతి వారం ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు సినిమాలు, సిరీస్ లు క్యూ కట్టాయి. మరి ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఏంటీ? వాటిలో స్పెషల్ గా ఏమున్నాయో ఇక్కడ చూసేయండి.

ఈ వారం ఓటీటీ సినిమాలు-నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఏకంగా 20+ మూవీస్-ఈ 5 క్రైమ్ థ్రిల్లర్స్ మిస్సవొద్దు!
ఈ వారం ఓటీటీ సినిమాలు-నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఏకంగా 20+ మూవీస్-ఈ 5 క్రైమ్ థ్రిల్లర్స్ మిస్సవొద్దు!

టాప్ 5 పిక్స్

1. కాన్ సిటీ (Con City - Netflix):

అర్జున్ దాస్, అన్నా బెన్ కాంబినేషన్‌లో వస్తున్న గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా. థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న మూవీ. ఈ చిత్రం జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ సహా ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

2. కేస్ ఆఫ్ కొండాన (Case Of Kondana - ETvWin):

2024లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కేస్ ఆఫ్ కొండన’. సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. జూలై 23 నుంచి ఈటీవీ విన్ (ETvWin) ఓటీటీలో ఈ చిత్రం తెలుగులో అందుబాటులోకి రానుంది.

3. పల్లిచట్టంబి (Pallichattambi - SonyLiv):

మలయాళంలో మంచి ఆదరణ పొందిన ఈ మలయాళ ఇంటెన్స్ డ్రామా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూలై 24 నుంచి సోనీలివ్‌లో తెలుగు డబ్బింగ్ ఆడియోతో వీక్షకులకు అందుబాటులోకి వస్తోంది.

4. మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ (Master Of The Universe - Prime Video):

యాక్షన్ అండ్ ఫాంటసీ ఆడియన్స్ కోసం జూలై 22న ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

5. 72 అవర్స్ & ప్రొటెక్టర్ (72 Hours & Protector):

హై-ఓల్టేజ్ యాక్షన్ ప్రియుల కోసం జూలై 24న నెట్‌ఫ్లిక్స్, లయన్స్ గేట్ ప్లే ప్లాట్‌ఫామ్‌లలో తెలుగు ఆడియోతో ఈ రెండు హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ వారం ఓటీటీ

  • ప్రైమ్ వీడియో

డిస్‌క్లోజర్ డే (Disclosure Day - ఇంగ్లీష్): స్టీవెన్ స్పీల్‌బెర్గ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ (ప్రైమ్ వీడియో రెెంట్ / ఆపిల్ టీవీ+)

గ్రెగ్ ఆల్‌మాన్ (Gregg Allman - ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో రెంట్

స్కేరీ మూవీ (Scary Movie - ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో రెంట్

స్టార్ వార్స్: ది మండలోరియన్ & గ్రోగు: ప్రైమ్ వీడియో రెంట్

మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ (Master Of The Universe): ప్రైమ్ వీడియో (తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ)

ఈగో రామన్ (Ego Raman): ప్రైమ్ వీడియో & సింప్లీ సౌత్ (తమిళం)

ఆదర్శ్ బాల్ విద్యాలయ: ప్రైమ్ వీడియో (హిందీ సిరీస్‌)

  • నెట్‌ఫ్లిక్స్

ముసాఫిర్ కేఫ్: నెట్‌ఫ్లిక్స్ (హిందీ సిరీస్‌లు)

ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (A Toxic Love Story): నెట్‌ఫ్లిక్స్ (తెలుగు, తమిళం, హిందీ)

ఎలైట్ ఫోర్స్ (Elite Force - ఫ్రెంచ్/ఇంగ్లీష్/హిందీ): నెట్‌ఫ్లిక్స్

ఎలిజ్: షాడో ఆఫ్ ఎ ఉమెన్ (Elize: Shadow of a Woman): నెట్‌ఫ్లిక్స్

మై డాటర్స్ ఫాదర్ (My Daughter's Father - స్పానిష్ సిరీస్): నెట్‌ఫ్లిక్స్

లవ్ ఇన్ స్లో మోషన్ (Love In Slow Motion - అరబిక్/హిందీ): నెట్‌ఫ్లిక్స్

ది డెబ్ట్ కలెక్టర్ (The Debt Collector - థాయ్/హిందీ): నెట్‌ఫ్లిక్స్

కాన్ సిటీ (Con City): నెట్‌ఫ్లిక్స్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)

72 అవర్స్ (72 Hours): నెట్‌ఫ్లిక్స్ (తెలుగు, తమిళం, హిందీ)

ది ట్రూథర్స్ (The Truthers): నెట్‌ఫ్లిక్స్ (తెలుగు, తమిళం, హిందీ)

  • ఇవి కూడా

కేస్ ఆఫ్ కొండాన (Case Of Kondana): ఈటీవీ విన్ (తెలుగు)

పల్లిచట్టంబి (Pallichattambi): సోనీలివ్ (తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ)

సీక్రెట్ ఆఫ్ కళింగ (Secret Of Kalinga): సన్ నెక్స్ట్ (మలయాళం)

ట్రిపుల్ డెక్కర్ (Triple Decker): మనోరమ మ్యాక్స్ (మలయాళం)

ప్రొటెక్టర్ (Protector): లయన్స్ గేట్ ప్లే (తెలుగు, తమిళం)

స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ & ది డెవిల్ వేర్స్ ప్రాడా 2: జియో హాట్‌స్టార్ (ఇంగ్లీష్)

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More