OTT Crime Thriller: పైకేమో సాఫ్ట్-కానీ ఈ ఫ్యామిలీ మహా డేంజరస్-ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ క్రైమ్ థ్రిల్లర్-తెలుగులోనూ!
OTT Crime Thriller: ఓటీటీలోకి ఓ తమిళ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వచ్చేస్తోంది. పైకేమో సాఫ్ట్ గా కనిపించే ఈ కుటుంబం వెనుకాల ఉండే సీక్రెట్స్ అదిరే థ్రిల్ ఇస్తాయి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అప్ డేట్ వచ్చింది. మరి ఆ మూవీ ఏదీ? ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేయండి.
OTT Crime Thriller: సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న అర్జున్ దాస్, కల్కి 2898 AD ఫేమ్ అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కాన్ సిటీ'. డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

కాన్ సిటీ ఓటీటీ
తమిళంలో డీసెంట్ హిట్ గా నిలిచిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘కాన్ సిటీ’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. జూలై 24 నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కాన్ సిటీని ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.
మంచి ధరకు
కాన్ సిటీ చిత్రం థియేట్రికల్ రన్‌లో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన సాధించింది. అయితే, సౌత్ ఇండియాలో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఓటీటీలో ఉండే విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు సొంతం చేసుకుందని టాక్.
రహస్యం ఏమిటి?
మంగళూరు నేపథ్యంలో సాగే ఈ కాన్ సిటీ సినిమా కథ ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. శరవణన్ (అర్జున్ దాస్), ఆయన భార్య మిత్ర (అన్నా బెన్) తమ దివ్యాంగుడైన కుమారుడు జీవాతో కలిసి జీవిస్తుంటారు. పైకి ఎంతో పద్ధతిగా కనిపించే ఈ కుటుంబం వెనుక ఒక పెద్ద క్రిమినల్ గతం ఉంటుంది. రకరకాల పరిస్థితుల్లో అన్యాయానికి గురై, ప్రాణాలు కాపాడుకోవడానికి 'కాన్ ఆర్టిస్టులు' (Scammers) గా మారిన ముఠానే వీళ్లు.
కొడుకు కిడ్నాప్ తో
అనుకోకుండా వీళ్ల కుమారుడు కిడ్నాప్ కావడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. శరవణన్ గతం వల్ల జరిగిన ఒక పాత స్కామ్ వల్లే ఈ కిడ్నాప్ జరిగిందని తెలుసుకున్న ఆ కుటుంబం తమ పిల్లాడిని కాపాడుకోవడానికి ఏం చేసింది? స్కామర్స్ అయిన ఫ్యామిలీ తమ తెలివితేటలతో విలన్లకు ఎలా ఎదురెళ్లింది? అనేది ఈ సినిమా స్టోరీ.
'కాన్ సిటీ' కీ హైలైట్స్
నటీనటులు: అర్జున్ దాస్, అన్నా బెన్, యోగి బాబు, వడివుక్కరసి, విటివి గణేష్.
దర్శకత్వం: హరీష్ దురైరాజ్ (Harish Durairaj - Debut Film)
సంగీతం: షాన్ రోల్డన్ (Sean Roldan)
డిజిటల్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
స్ట్రీమింగ్ తేదీ: జూలై 24
భాషలు: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.
ఓటీటీలో గ్రాండ్ కంబ్యాక్ ఖాయం!
ఇటీవలి కాలంలో థియేటర్లలో యావరేజ్‌గా ఆడి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లోకి వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. 'కాన్ సిటీ' చిత్రంలో అర్జున్ దాస్ తన రెగ్యులర్ ఇంటెన్స్ రోల్స్‌కి భిన్నంగా సాఫ్ట్ అండ్ ఎమోషనల్ ఫాదర్ పాత్రలో నటించగా, యోగి బాబు - వడివుక్కరసి జోడీ అందించే కామిక్ రిలీఫ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. షాన్ రోల్డన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డ్రామాను నడిపించడంలో కీలక పాత్ర పోషించింది.
యునీక్ కాన్-ఆర్టిస్ట్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్. సస్పెన్స్ ఎలిమెంట్స్ మిళితమై ఉండటంతో డిజిటల్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఒక పర్‌ఫెక్ట్ వీకెండ్ వాచ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


