Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఓ శవం

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్ లోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. తాజాగా శుక్రవారం (మే 22) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ తల్లి, తన ఇద్దరు కూతుళ్లు, ఓ శవం చుట్టూ తిరిగే స్టోరీతో ఈ మూవీ వస్తోంది.

Published on: May 22, 2026, 19:57:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix Thriller: బాలీవుడ్ ధక్ ధక్ గర్ల్ మాధురీ దీక్షిత్, నేటి తరం సెన్సేషన్ తృప్తి దిమ్రి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధర్నా దుర్గా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త మూవీ 'మా బెహన్'. సురేష్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ శుక్రవారం (మే 22) విడుదల చేశారు. క్రైమ్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ కలగలిపిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తుతోంది.

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఓ శవం
Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఓ శవం

నవ్వులు పూయిస్తున్న క్రైమ్ సస్పెన్స్ కథ

ట్రైలర్ ప్రారంభంలో నగలు అమ్మేసిన కూతురు జయ (తృప్తి దిమ్రి)ను తల్లి రేఖ (మాధురీ దీక్షిత్) తిట్టడం కనిపిస్తుంది. అయితే తల్లి చేసే పనుల వల్లే కుటుంబం కష్టాల్లో పడిందని మరో కూతురు సుష్మ (ధర్నా దుర్గా) గుర్తు చేస్తుంది. భర్త చనిపోయినా కూడా తల్లి ఇంకా ఫ్లర్ట్ చేస్తోందంటూ జయ గొడవ పడుతుంది. ఈ క్రమంలోనే వారి ఇంటి పక్కన ఉండే గుప్తా జీ (రవి కిషన్) రేఖతో సరసాలు ఆడటం చూపిస్తారు.

కథ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోకుండా గుప్తా జీ రేఖ ఇంట్లోనే అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతాడు. దీంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. కంగారుపడిన రేఖ.. అర్ధరాత్రి వేళ తన కూతుళ్లను పిలిచి ఆ శవాన్ని దాచడానికి సహాయం అడుగుతుంది. చుట్టుపక్కల వాళ్ల కళ్లు గప్పి ఆ శవాన్ని ఎలా మాయం చేశారనేదే అసలు కథ. గుప్తా జీ భార్య (గీతాంజలి కులకర్ణి), ఒక పోలీస్ ఆఫీసర్ (అరుణోదయ్ సింగ్) గుప్తా జీ కోసం వెతకడం మొదలుపెట్టడంతో ఈ ముగ్గురు మహిళల కష్టాలు మరింత ఎక్కువవుతాయి.

రెగ్యులర్ మదర్ క్యారెక్టర్ కాదు: మాధురీ దీక్షిత్

ఈ సినిమాలో తన పాత్ర గురించి మాధురీ దీక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "హిందీ సినిమాల్లో కనిపించే రొటీన్ తల్లి పాత్ర లాంటిది కాదు రేఖ క్యారెక్టర్. అందుకే ఈ పాత్ర చేయడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండే ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేయడం ఒక నటిగా నాకెంతో తృప్తిని ఇస్తుంది. రేఖ పర్ఫెక్ట్ మదర్ కాకపోవచ్చు, కానీ ఏ తల్లికైనా తన కూతుళ్ల బాధ్యత ముఖ్యం. ఈ గందరగోళం మధ్య ఆమె తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందనేదే ఆసక్తికరం" అని మాధురీ దీక్షిత్ పేర్కొన్నారు.

మాధురీ గారితో నటించడం నా అదృష్టం: తృప్తి దిమ్రి

చిత్రంలో మరో కీలక పాత్ర పోషించిన తృప్తి దిమ్రి కూడా షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. "ఇంట్లో పద్ధతిగా ఉండే అమ్మాయి జయ. ఏది తప్పు, ఏది రైట్ అనే స్పష్టమైన అవగాహన ఆమెకు ఉంటుంది. తన చుట్టూ జరిగే గొడవలను ఆపాలని చూసి, తనే అందులో ఇరుక్కుపోతుంది. సినిమాలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య వచ్చే సీన్లు నాకు బాగా నచ్చాయి. ఒక తరం మొత్తాన్ని తన నటనతో మంత్రముగ్ధులను చేసిన లెజెండరీ నటి మాధురీ దీక్షిత్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఈ సినిమా నాకు పుట్టింటికి వచ్చిన అనుభూతిని ఇచ్చింది" అని తృప్తి దిమ్రి తన ఆనందాన్ని పంచుకున్నారు.

అబుండెన్షియా ఎంటర్‌టైన్‌మెంట్, ఓపెనింగ్ ఇమేజ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వైవిధ్యమైన డార్క్ కామెడీ చిత్రం నేరుగా ఓటీటీలోనే సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 4 నుంచి 'మా బెహన్' స్ట్రీమింగ్ కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'మా బెహన్' సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో, ఎప్పుడు విడుదల కానుంది?

'మా బెహన్' చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

2. 'మా బెహన్' చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?

ఈ చిత్రంలో సీనియర్ నటి మాధురీ దీక్షిత్, యంగ్ బ్యూటీ తృప్తి దిమ్రి, సోషల్ మీడియా సెలబ్రిటీ ధర్నా దుర్గా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రవి కిషన్, గీతాంజలి కులకర్ణి, అరుణోదయ్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

3. 'మా బెహన్' సినిమా కథాంశం ఏమిటి?

ఇదొక ఫ్యామిలీ క్రైమ్ కామెడీ డ్రామా. ఇంట్లో హఠాత్తుగా చనిపోయిన పొరుగు వ్యక్తి శవాన్ని దాచడానికి ఒక తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్లు పడే ఇబ్బందులు, ఆ క్రమంలో వచ్చే హాస్యాస్పద సన్నివేశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More