Madhuri Dixit Real Estate: భారీగా సీనియర్ హీరోయిన్ రియల్ ఎస్టేట్ డీల్- రెంట్‌కి 2.81 కోట్లు-మాధురి దీక్షిత్ ఒప్పందం ఇదే!

Madhuri Dixit Real Estate Deal Commercial Office: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఒక ఖరీదైన కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నారు. ఆ ఆఫీస్‌కు రూ. 2.81 కోట్ల అద్దె ఒప్పందం జరిగినట్లు సదరు రిజిస్ట్రేషన్ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

Published on: Mar 27, 2026, 14:31:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాల పాటు తన నటనతో, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంతో వార్తల్లో నిలిచారు.

భారీగా సీనియర్ హీరోయిన్ రియల్ ఎస్టేట్ డీల్- రెంట్‌కి 2.81 కోట్లు-మాధురి దీక్షిత్ ఒప్పందం ఇదే!
భారీగా సీనియర్ హీరోయిన్ రియల్ ఎస్టేట్ డీల్- రెంట్‌కి 2.81 కోట్లు-మాధురి దీక్షిత్ ఒప్పందం ఇదే!

ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కమర్షియల్ హబ్‌లలో ఒకటైన లోయర్ పరేల్‌లో మాధురి దీక్షిత్ ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. స్క్వేర్ యార్డ్స్ (Square Yards) సమీక్షించిన పత్రాల ప్రకారం, ఈ లీజు ఒప్పందం ఐదేళ్ల పాటు కొనసాగనుంది.

ఆఫీస్ స్పేస్ విశేషాలివే..

లోయర్ పరేల్‌లోని 'వన్ లోధా ప్లేస్' (One Lodha Place) భవనంలో ఈ కమర్షియల్ యూనిట్ ఉంది. సుమారు 731 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ ఆఫీసుతో పాటు ఒక కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ లావాదేవీని మార్చి 24, 2026న రిజిస్టర్ చేశారు.

దీని కోసం రూ. 72,600 స్టాంపు డ్యూటీ, రూ. 1,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించడంతో పాటు రూ. 17 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ను మాధురి దీక్షిత్ జమ చేశారు. ఈ ఆస్తిని రింకూ పరిక్షిత్ జోషి అనే వ్యక్తి నుంచి మాధురి లీజుకు తీసుకున్నారు.

ఏటేటా పెరగనున్న అద్దె

ఈ ఐదేళ్ల (60 నెలల) లీజు కాలంలో అద్దె ఏటేటా పెరిగేలా ఒప్పందం కుదిరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

మొదటి ఏడాది: నెలకు రూ. 4.25 లక్షలు.

రెండో ఏడాది: 5 శాతం పెరుగుదలతో రూ. 4.46 లక్షలు.

మూడో ఏడాది: రూ. 4.68 లక్షలు.

నాలుగో ఏడాది: రూ. 4.91 లక్షలు.

ఐదో ఏడాది: రూ. 5.16 లక్షలకు అద్దె చేరుకుంటుంది.

మొత్తంగా ఐదేళ్ల కాలానికి మాధురి దీక్షిత్ చెల్లించే అద్దె విలువ రూ. 2.81 కోట్లుగా ఉండనుంది.

లోయర్ పరేల్ ప్రత్యేకత

ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న లోయర్ పరేల్ ఇప్పుడు ముంబైలోని అత్యంత ఖరీదైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా మారింది. కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, సంపన్న కుటుంబాలకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఎత్తైన విలాసవంతమైన భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

శుభ్‌మన్ గిల్ కూడా

ఇటీవలే టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ముంబైలోని జుహు ప్రాంతంలో రూ. 20 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాధురీ దీక్షిత్ ఈ భారీ డీల్ ద్వారా మరోసారి ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More