Zee5 OTT List: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఒకే ప్లాట్‌ఫామ్‌లో వెంకీ- అనిల్ మూవీ, వృషకర్మ, ఎన్‌బీకే 111.. ఇంకా మరెన్నో!
Zee5 OTT List: ఓటీటీ లవర్స్ కు అసలైన సినీ పండగ రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 కొత్త సినిమాలు, సిరీస్ లతో రెడీ అవుతోంది. జీ5 అప్ కమింగ్ సినిమాలు, సిరీస్ లు లిస్ట్ ను ఇవాళ అనౌన్స్ చేసింది. ఇందులో తెలుగు సహా అన్ని భాషల్లో క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
Zee5 OTT List: డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ మరో లెవెల్ లో అందించేందుకు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 రెడీ అవుతోంది. క్రేజీ సినిమాలు, సిరీస్ లను ఓటీటీలోకి తీసుకు రానుంది. తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్ వివరాలను జీ5 ఓటీటీ ఇవాళ (జూలై 19) అనౌన్స్ చేసింది.

వెంకీ- అనిల్ మూవీ
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఆ తర్వాత జీ5 ఓటీటీలో రిలీజ్ అవుతుంది.
బాలయ్య నట విశ్వరూపం
నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్ కమింగ్ మూవీ ‘ఎన్‌బీకే111 (వర్కింగ్ టైటిల్)’ కూడా జీ5 ఓటీటీలోకే రానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నయనతార, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు.
వృషకర్మ కూడా
టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టుల్లో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ ఒకటి. కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రెడీ అవుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. నాగ చైతన్య మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఓ మిస్టరీ మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ కూడా జీ5లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
వీటిపైనా లుక్కేయండి
ఇవే కాకుండా మిగతా తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోని అప్ కమింగ్ సినిమాలు, సిరీస్ లను జీ5 అనౌన్స్ చేసింది. ఇందులో ముఖ్యంగా కంగనా రనౌత్ నటించిన ‘భారత భాగ్య విధాత’, వరుణ్ ధావన్ ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ హిందీ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
ఈ సిరీస్ లు
మరోవైపు వెబ్ సిరీస్ ల పరంగానూ జీ5 క్రేజీ అనౌన్స్ మెంట్ చేసింది. తమిళంలో తడయం 2, కూసే మునిసామి వీరప్పన్ సీజన్ 2ను ప్రకటించింది. ఇంకా రావడి, హాయ్, డీమాంటీ కాలనీ 3 లాంటి తమిళ సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.
ఇంకా బందర్, కాంబ్లీ, రంగ్ బాజ్ 4, కాఫీ కింగ్, సుమో దీదీ, కేరళ అండర్ గ్రౌండ్, శ్రీమతి, ఆబ్జెక్షన్ మై లార్డ్, పూజా మేరీ జాన్, మలబార్ కప్, ఏ క్వీన్, ది డెవిల్ లాంటి సినిమాలు, సిరీస్ లు జీ5 ఓటీటీలోకి రాబోతున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


