OTT Most Watched:గత ఆరు నెలల్లో ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సౌత్ ఇండియా మూవీ ఇదే-మాంత్రికుడి ఆటలు-హారర్ థ్రిల్లర్ కు ఫిదా!
OTT Most Watched: 2026 జనవరి నుంచి జూన్ వరకు ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సౌత్ ఇండియా మూవీ ఏదో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మాంత్రికుడు ఆడే ఆటలు, హీరో పోరాటంతో సాగే ఈ తెలుగు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. వెంటనే ఈ మూవీపై ఓ లుక్కేయండి.
OTT Most Watched: థియేటర్లలో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు కూడా ఓటీటీని షేక్ చేస్తాయి. సగం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయిన మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ‘ది రాజాసాబ్’ మూవీ. అవును.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీలో అదరగొడుతోంది. గత ఆరు నెలల్లో ఎక్కువ మంది చూసిన సౌత్ ఇండియా మూవీగా నిలిచింది.

17.5 మిలియన్ వ్యూస్‌తో టాప్
ప్రముఖ మీడియా ట్రాకింగ్ ఏజెన్సీ ‘ఓర్మాక్స్ మీడియా’ తాజాగా విడుదల చేసిన నివేదిక (జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు) ప్రకారం.. సౌత్ ఇండియాలోనే గత ఆరు నెలల్లో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా ‘ది రాజా సాబ్’ నిలిచింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఏకంగా 17.5 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
ప్రభాస్ ఫస్ట్ టైమ్
రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ యాక్ట్ చేసిన హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. రిలీజ్ కు ముందు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్లలో బొక్కబోర్లా పడింది. ఓటీటీలో మాత్రం నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామర్ హంగులు, ప్రభాస్ కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
భారీ నష్టం
ఈ ఏడాది జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద అత్యంత ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. బాహుబలి, సలార్, కల్కి లాంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్‌ను ఒక అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ / ఫాంటసీ జోనర్‌లో చూడటానికి థియేటర్ ఆడియన్స్ అంతగా ఇష్టపడలేదు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి మేకర్స్‌కు దాదాపు రూ.170 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చిందని టాక్.
ఓటీటీలో పర్ఫెక్ట్
థియేటర్లలో 'రాజా సాబ్' ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం టికెట్ ధరల పెంపు, ప్రభాస్ ఇమేజ్‌పై ఉన్న భారీ అంచనాలే. కానీ ఓటీటీలోకి వచ్చేసరికి ఈ ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది. రూపాయి అదనపు ఖర్చు లేకుండా, ఇంట్లోనే కూర్చుని క్యాజువల్ రిలాక్స్డ్ వాచ్‌గా చూసే ఓటీటీ ఆడియన్స్‌కు మారుతి మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్, హారర్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అయ్యాయి.
హీరో తాతయ్య ఆడే మాంత్రిక, తాంత్రిక ఆటలు.. వాటికి హీరో సమాధానం ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో రిజెక్ట్ అయిన కంటెంట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిపీట్ వాల్యూతో ఎలా బ్లాక్‌బస్టర్ అవుతుందో చెప్పడానికి ఈ సినిమా ఒక క్లాసిక్ కేస్ స్టడీ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


