OTT Telugu: ఈటీవీ విన్ లోకి మరో ఫీల్ గుడ్ మూవీ.. సొంత ఇల్లు కల.. మూవీ డ్రీమ్.. ఓటీటీ స్ట్రీమింగ్ షురూ.. ఎందుకు చూడాలంటే?

OTT Telugu: ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లోకి ఈ రోజు ఓ ఫీల్ గుడ్ తెలుగు మూవీ వచ్చేసింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్ నేపథ్యంలో సొంత ఇంటి కల కోసం ఓ కుటుంబం ఏం చేసిందనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. మట్టి వాసనతో, మన కథగా వచ్చిన ఈ చిత్రం ఏంటీ? ఈ మూవీని ఎందుకు చూడాలి? అనేది మీ కోసం.

Published on: Jul 16, 2026, 10:37:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: తెలుగు డిజిటల్ విండోలో భారీ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే.. మట్టి వాసన ఉన్న కథలు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రాలకే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రేజ్‌ను పక్కాగా క్యాష్ చేసుకుంటూ 'ఈటీవీ విన్' సరికొత్త రూటెడ్ డ్రామాతో మన ముందుకు వచ్చింది. ఆ సినిమానే ‘మధురాపురి సదన’.

ఈటీవీ విన్ లోకి మరో ఫీల్ గుడ్ మూవీ.. సొంత ఇల్లు కల.. మూవీ డ్రీమ్.. ఓటీటీ స్ట్రీమింగ్ షురూ.. ఎందుకు చూడాలంటే? (youtube)
ఈటీవీ విన్ లోకి మరో ఫీల్ గుడ్ మూవీ.. సొంత ఇల్లు కల.. మూవీ డ్రీమ్.. ఓటీటీ స్ట్రీమింగ్ షురూ.. ఎందుకు చూడాలంటే? (youtube)

మధురాపురి సదన ఓటీటీ

ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. లెక్కలేనన్ని మూవీస్ స్ట్రీమింగ్ లో ఉన్నాయి. అయితే వీటిలో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలకు, మిడిల్ క్లాస్ స్టోరీగా రిలేటడ్ గా ఉండే సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సినిమానే ‘మధురాపురి సదన’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (జూలై 16) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కమర్షియల్ హంగులు లేని స్వచ్ఛమైన కథ

'మధురాపురి సదన' సినిమా పూర్తిగా ఒక మధ్యతరగతి కుటుంబం, వారి కలలు, అనుబంధాలు, సొంత ఇల్లు/గూడు అనే భావోద్వేగం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో భరత్ సాయినాథ్ వర్మ, యషు మశెట్టి లీడ్ రోల్స్ పోషించగా.. డీడీ శ్రీనివాస్, నీలా ప్రియ, సుశాంత్ నాయుడు, కెవిన్ అగస్టిన్, స్రవంతి, భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు.

స్టోరీ ఇదే

మధురాపురి సదన ఓ క్లీన్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీ. సొంత ఇల్లు కోసం ఓ కుటుంబం పడే తపనే ఈ చిత్రం. రెంట్ కు ఉండే ఆ ఇంట్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలుంటారు. అమ్మాయి ఏమో వేరే దేశంలో జాబ్ చేస్తుంటుంది. అబ్బాయి ఏమో సినిమా తీయాలనే కల కంటాడు. అతనికి లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

ఈ కుటుంబం తమ కలను నెరవేర్చుకోవడానికి సొంత ఇల్లు నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కానీ మధ్యలో అడ్డంకులు వస్తాయి. మరి వీటిని దాటి వీళ్లు సొంత ఇల్లు కట్టుకున్నారా? అన్నదే మధురాపురి సదన మూవీ కథ.

ఎందుకు చూడాలంటే?

  • ఒకప్పుడు థియేటర్లలో ‘కలిసుందాం రా’ లేదా ‘శతమానం భవతి’ లాంటి సినిమాలకు వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్.. ఇప్పుడు థియేటర్ టికెట్ ధరలు, ఓటీటీ కంఫర్ట్ రీత్యా ఇంట్లోనే కూర్చుని ఇలాంటి క్లీన్ డ్రామాలను చూడటానికి ఇష్టపడుతున్నారు.
  • దర్శకుడు సాయి తరుణ్ రెడ్డి ఎక్కడా కమర్షియల్ డీవియేషన్స్ లేకుండా, పూర్తిగా క్యారెక్టర్ డ్రివెన్ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని మలిచినట్లు తెలుస్తోంది.
  • మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథగా మధురాపురి సదన సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ చేసేలా ఉంటాయి.
  • భారీ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు పోటీ పడుతుంటే.. ఈటీవీ విన్ మాత్రం పక్కా లోకల్ కంటెంట్‌తో తెలుగు ఓటీటీ స్పేస్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేసుకుంటోంది. ‘మధురాపురి సదన’ ఆ స్ట్రాటజీలో భాగమే.
  • విష్ణు విహారి అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేశాయి. నేటి డిజిటల్ యుగంలో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ల ఓవర్-డోస్ మధ్య నలిగిపోతున్న వీక్షకులకు ఈ వీకెండ్‌లో 'మధురాపురి సదన' ఒక మంచి రిఫ్రెషింగ్ చాయిస్ కానుంది.
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More