Netflix Trending: ఊరికి శాపం.. బంగారంలా మారే మనుషులు.. నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న తెలుగు మూవీ.. ఓటీటీ ట్రెండింగ్

Netflix Trending: థియేటర్లలో ఆడియన్స్ తో వావ్ అనిపించిన తెలుగు మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. డైలాగ్స్ లేకుండా కేవలం పాటలతోనే సాగే భారతదేశపు మొట్టమొదటి ఫీచర్ లెంగ్త్ మ్యూజికల్ ఫాంటసీగా రికార్డు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఓ లుక్కేయండి.

Published on: Jul 13, 2026, 05:36:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix Trending: టాలీవుడ్‌లో రొటీన్ మాస్ మసాలా, క్రైమ్ థ్రిల్లర్ల ఫార్ములాతో బోర్ గా ఫీల్ అవుతున్న డిజిటల్ ఆడియన్స్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఒక అద్భుతమైన క్లాసిక్ వండర్ కొత్త ఎక్ పీరియన్స్ ఇస్తోంది. అదే... ‘సింగ్ గీతం’ (Sing Geetham) సినిమా. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ చార్ట్స్‌లో దూసుకెళ్తోంది.

ఊరికి శాపం.. బంగారంలా మారే మనుషులు.. నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న తెలుగు మూవీ.. ఓటీటీ ట్రెండింగ్
ఊరికి శాపం.. బంగారంలా మారే మనుషులు.. నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న తెలుగు మూవీ.. ఓటీటీ ట్రెండింగ్

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్

లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మ్యూజికల్ వండర్ ‘సింగ్ గీతం’ మూవీ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ తెలుగు సినిమా అదరగొడుతోంది. ఇండియాలో టాప్ 10 సినిమాల్లో సింగ్ గీతం ఆరో ప్లేస్ కు చేరుకుంది. సోషల్ మీడియాలో ఈ మూవీకి ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్లు నుంచి మరింత పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఇండియాలో ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్

‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ వంటి కాలాతీత క్లాసిక్స్‌ను అందించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డ్రీమ్ ప్రాజెక్ట్ సింగ్ గీతం సినిమా. ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా.. సినిమాలో కథ మొత్తాన్ని కేవలం పాటల ద్వారానే నడిపించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు.

బంగారంలా మారే జనాలు

ఫ్రెష్ కంటెంట్ తో, డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ తో వచ్చిన సింగ్ గీతం మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో మిస్ అయిన జనాలు ఓటీటీలో ఈ మూవీకి జై కొడుతున్నారు. శాపం కారణంగా బంగారంలా మారే జనాలు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. మరి చివరకు ఏమైంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.

ప్రొడ్యూసర్ నమ్మకం

ఈ వినూత్నమైన కథను కమర్షియల్ ప్రొడ్యూసర్లు నమ్మడానికి వెనుకాడిన తరుణంలో, ‘కల్కి 2898 AD’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను ఓన్ చేసుకున్నారు. సింగీతం విజన్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్క్రీన్‌పైకి తీసుకురావడానికి నాగ్ అశ్విన్ అందించిన క్రియేటివ్ అండ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ సినిమాకు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. థియేట్రికల్ రన్‌లోనే ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని దాటి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టడం విశేషం.

ఓటీటీలో ఎందుకు కల్ట్ హిట్‌గా మారుతోంది?

థియేటర్లలో ఈ ఎక్స్‌పెరిమెంట్‌ను మిస్ అయిన క్లాస్ ఆడియన్స్, సినీ లవర్స్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో దీనిని రిపీట్ మోడ్‌లో చూస్తున్నారు. కొత్తగా వస్తున్న ఏ కమర్షియల్ సినిమాలూ ఇవ్వని ఒక రిఫ్రెషింగ్, ఎమోషనల్ అండ్ హార్ట్-టచింగ్ ఫాంటసీ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇస్తుండటమే దీని సక్సెస్ సీక్రెట్.

సోషల్ మీడియాలో ఈ వయసులోనూ సింగీతం క్రియేటివిటీకి, ఆయనపై నమ్మకం ఉంచిన నాగ్ అశ్విన్‌కు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More