Sing Geetham OTT: నెట్‌ఫ్లిక్స్ అర్ధరాత్రి సర్‌ప్రైజ్- ఒక రోజు ముందే ఓటీటీలోకి సింగ్ గీతం- కారణం ఇదే- ఆడియన్స్ ఫిదా!

Sing Geetham OTT: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సినీ ప్రియులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. మ్యూజికల్ వండర్ ‘సింగ్ గీతం’ మూవీని ఒక రోజు ముందే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈ చిత్రం అర్ధరాత్రే ఓటీటీలో రిలీజైంది. మరి దీని వెనుకాల ఉన్న కారణం ఏంటీ? మూవీ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 8, 2026, 05:41:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sing Geetham OTT: తెలుగు సినిమా రంగంలో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ ‘సింగ్ గీతం’. మ్యూజికల్ వండర్ గా సరికొత్త ప్రయోగంతో థియేటర్లకు వచ్చిన ఈ ఫిల్మ్.. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టింది. ఒక రోజు ముందుగానే ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

నెట్‌ఫ్లిక్స్ అర్ధరాత్రి సర్‌ప్రైజ్- ఒక రోజు ముందే ఓటీటీలోకి సింగ్ గీతం (x/Netflix_INSouth)
నెట్‌ఫ్లిక్స్ అర్ధరాత్రి సర్‌ప్రైజ్- ఒక రోజు ముందే ఓటీటీలోకి సింగ్ గీతం (x/Netflix_INSouth)

సింగ్ గీతం ఓటీటీ

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) నిర్మించిన విజువల్ వండర్ సినిమా 'సింగ్ గీతం' (Sing Geetham). లెజెండ్రీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మార్క్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ఓటీటీ ప్రీమియర్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ డేట్ కంటే ఒక రోజు ముందే స్ట్రీమింగ్స్ స్టార్ట్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ మిడ్‌నైట్ రిలీజ్

నిజానికి సింగ్ గీతం సినిమా రేపు (జూలై 9) డిజిటల్ ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఓటీటీ లవర్స్ కు నెట్‌ఫ్లిక్స్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఒక రోజు ముందుగానే సింగ్ గీతం మూవీని తీసుకొచ్చింది. ఈ అర్ధరాత్రి నుంచే ఈ సినిమా హోమ్ స్క్రీన్‌పై కనిపించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఇలా అకస్మాత్తుగా ఒక రోజు ముందే సింగ్ గీతం సినిమాను దించడం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పెద్దితో పోటీ

జూలై 9న రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పెద్ది ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అందుకే పెద్ది, సింగ్ గీతం ఒకే రోజు ఓటీటీ రిలీజ్ క్లాష్ లేకుండా చూసేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుందని టాక్. పెద్ది ఓటీటీ రిలీజ్ అంటే ఆ మూవీకే హైప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ కు క్రేజ్ రాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఇక సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ విషయంలో సర్ ప్రైజ్ ఇవ్వడం ద్వారా ఈ మూవీపై బజ్ క్రియేట్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనేది మరో కారణంగా చెప్పొచ్చు.

వీకెండ్ ఫీస్ట్

జూన్ 12న థియేటర్లలోకి వచ్చినప్పుడు బాక్సాఫీస్ వద్ద సింగ్ గీతం సేఫ్ గానే నిలిచింది. కానీ మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల కమర్షియల్‌గా భారీ వసూళ్లు రాబట్టలేకపోయినా, థియేటర్ల బయట వినిపించిన పబ్లిక్ టాక్ ప్రకారం క్లాస్ ఆడియన్స్ దీనికి ఫిదా అయ్యారు.

ఇప్పుడు అయాన్, అహిల్యా బమ్రూల పర్ఫార్మెన్స్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సోల్‌ఫుల్ మ్యూజిక్ ఓటీటీ స్క్రీన్స్‌పై అద్భుతమైన అనుభూతిని ఇస్తాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయోగాత్మక చిత్రాలను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్‌కు ఈ వీకెండ్‌లో 'సింగీతం' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఇప్పటికే ఓటీటీలో మూవీని చూసిన ఆడియన్స్.. సింగ్ గీతంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More