Sing Geetham: 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ప్రయోగం- సింగ్ గీతం టీజర్‌కు ఫిదా- కుర్ర దర్శకులకు సవాల్!
Singeetham Srinivasa Rao Sing Geetham Teaser Response: తెలుగు సినిమా గర్వించదగ్గ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న 'సింగ్ గీతం' టీజర్‌కు నెటిజన్స్ నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఫిదా అవుతున్నారు.
Singeetham Srinivasa Rao Sing Geetham Teaser Response: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారంటేనే అందరిలోనూ ఏదో తెలియని ఉత్కంఠ నెలకొంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'సింగ్ గీతం' టీజర్ ఆ ఉత్కంఠను రెట్టింపు చేసింది.

1 నిమిషం 22 సెకన్ల నిడివి
తన పేరులోని పదాలతోనే ఈ చిత్రానికి 'సింగ్ గీతం' అని టైటిల్ పెట్టడం విశేషం. 1 నిమిషం 22 సెకన్ల నిడివి ఉన్న సింగ్ గీతం టీజర్ ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. మ్యూజికల్ ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 11న థియేటర్లలోకి రానుంది.
కథా నేపథ్యం ఏంటి?
ప్రతాప్ అనే యువకుడు ఒక పాత గని ప్రాంతానికి చేరుకోవడంతో ఈ కథ మొదలవుతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. బంగారం కోసం వెతికే మనుషులు, అక్కడ కనిపించే వింత పరిస్థితుల మధ్య ప్రతాప్ ప్రయాణం ఎలా సాగింది? అభివృద్ధికి, ప్రకృతి పరిరక్షణకు మధ్య నలిగిపోయే ఒక వ్యవస్థలో అతను తీసుకున్న నిర్ణయాలేంటి? అనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు.
ట్రెండింగ్‌లో 'యంగ్' మైండ్ సింగీతం
ఇందులో అయాన్, అహల్యా బామ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తులసి, బెనర్జీ, శివనారాయణ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సింగ్ గీతం టీజర్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు సింగీతం విజన్‌కు ఫిదా అవుతున్నారు.
"ఈ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మెదడు (Youngest Mind) నుంచి వచ్చిన అద్భుతం ఇది" అని నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొనియాడారు. "94 ఏళ్ల వయసులో జెన్-జీ (Gen-Z) దర్శకులకు గట్టి పోటీ ఇస్తున్నారు" అని నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
మరోవైపు, ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సంగీతంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డీఎస్పీ నుంచి ఒక పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 'కల్కి 2898 ఏడీ' దర్శకుడు నాగ్ అశ్విన్ సమర్పణలో, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం మరో విశేషం.
ప్రయోగాల రారాజు ప్రస్థానం
1972లో 'నీతి నిజాయితీ' సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాకు ఎన్నో అపురూప చిత్రాలను అందించారు. మూకీ సినిమాగా'పుష్పక విమానం', టైమ్ ట్రావెల్ చిత్రంగా 'ఆదిత్య 369', జానపద కథగా 'భైరవద్వీపం', నవ్వుల పువ్వులు పూయించిన 'బృందావనం' వంటి చిత్రాలు సింగీతం శ్రీనివాసరావు సృజనాత్మకతకు నిదర్శనాలు.
2013లో వచ్చిన 'వెల్‌కమ్ ఒబామా' మూవీ తర్వాత సింగీతం శ్రీనివాసరావు చేసిన ఈ కొత్త ప్రయత్నం టాలీవుడ్ స్థాయిని మరోసారి పెంచుతుందనడంలో సందేహం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
ఈ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
2. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.
3. 'సింగ్ గీతం' చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
4. సింగీతం శ్రీనివాసరావు వయస్సు ఎంత?
ప్రస్తుతం ఆయన వయస్సు 94 ఏళ్లు. ఈ వయస్సులోనూ ఆయన తన అద్భుతమైన పనితీరుతో సినీ రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


