మా సంస్థ ద్వారా అలాంటి సినిమా ఇవ్వలేకపోయాం.. కల్కి 2898 ఏడీ, సీతారామం, మహానటి నిర్మాత స్వప్న దత్ కామెంట్స్

ప్రభాస్ కల్కి 2898 ఏడీ, సీతారామం, మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన నిర్మాతల్లో స్వప్న దత్ ఒకరు. స్వప్న దత్ ఇటీవల సంగీత్ శోభన్, మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 14, 2026, 12:43:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ పాపులర్ నిర్మాతల్లో స్వప్న దత్ ఒకరు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ, దుల్కర్ సల్మాన్ సీతారామం, కీర్తి సురేశ్ మహానటి, నాని ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన నిర్మాతల్లో స్వప్న దత్ ఒకరు. ఇటీవల స్వప్న దత్ కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

మా సంస్థ ద్వారా అలాంటి సినిమా ఇవ్వలేకపోయాం.. కల్కి 2898 ఏడీ, సీతారామం, మహానటి నిర్మాత స్వప్న దత్ కామెంట్స్
మా సంస్థ ద్వారా అలాంటి సినిమా ఇవ్వలేకపోయాం.. కల్కి 2898 ఏడీ, సీతారామం, మహానటి నిర్మాత స్వప్న దత్ కామెంట్స్

రెండు రోజుల ముందు

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ ఇవాళ (ఫిబ్రవరి 14) థియేటర్లలో విడుదల అయింది. అయితే, మూవీ రిలీజ్‌కు 2 రోజుల ముందు ఫిబ్రవరి 12న కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత స్వప్న దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ సినిమాలన్నీ ఇష్టం

ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ మూవీ కంటెంట్ కొత్తగా అనిపిస్తోంది. సినిమా కావాల్సినవన్నీ యూవీ సంస్థ ఇస్తుంటుంది. వాళ్ల బ్యానర్ సినిమాలన్నీ నాకు ఇష్టం" అని అన్నారు.

బ్రేక్ కోసం చూస్తున్నాడు

"సంతోష్ మా అందరికీ ఇష్టమైన యాక్టర్. అతనికి చాలా టాలెంట్ ఉంది. ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మా సంస్థ ద్వారా అలాంటి సినిమా ఇవ్వలేకపోయాం. కానీ, కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాం" అని స్వప్న దత్ కోరుకున్నారు.

బ్యూటిపుల్ రిలేషన్ చూస్తారు

ఇదే ఈవెంట్‌లో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాను. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య బ్యూటిపుల్ రిలేషన్ చూస్తారు" అని అన్నారు.

అందంగా కనిపించడమే కాదు

"కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చూశాక సంతోష్ శోభన్ ఈ మూవీ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో అర్థమైంది. మానస వారణాసి అందంగా కనిపించడమే కాదు తన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే క్రెడిట్ యూవీ క్రియేషన్స్‌కు ఇవ్వాలి" అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

హిట్ దక్కాలని కోరుకుంటున్నా

డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. "ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్.. ఇలా ఏ కంటెంట్ రిలీజ్ చేసినా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అజయ్ అన్నలోని పాజిటివ్ ఎనర్జీనే ఈ మూవీకి వచ్చిందని అనుకుంటున్నాను. ఈ చిత్రంతో యూవీ సంస్థకు మంచి సక్సెస్ రావాలి. డైరెక్టర్ అశ్విన్‌లోని హానెస్టీ ఈ సినిమా ప్రతి విజువల్‌లోనూ కనిపిస్తోంది. సంతోష్ శోభన్‌కు హిట్ దక్కాలని కోరుకుంటున్నా" అని ఆశించారు.

ప్రేక్షకుల మధ్యే చూడాలనుకుంటున్నా

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి ఆల్‌రెడీ ప్రతి ఒక్కరూ హిట్ అని చెబుతున్నారు. నేను థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యే చూడాలని అనుకుంటున్నా. మా యూవీ ప్రొడ్యూసర్స్ పాషనేట్ ప్రొడ్యూసర్స్. నాతో భారీ బడ్జెట్ పెట్టి బైకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యూవీకి మంచి సక్సెస్ అందిస్తుంది" అని జోస్యం చెప్పారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More