ఓటీటీలోకి డైరెక్ట్‌గా కీర్తి సురేశ్, సుహాస్ ఉప్పు కప్పురంబు- అంత్యక్రియలపై సెటైరికల్ కామెడీ మూవీ- 5 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి నేరుగా ఉప్పు కప్పురంబు డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. కీర్తి సురేశ్, సుహాస్ తొలిసారిగా నటించిన ఉప్పు కప్పురంబు మూవీకి ఐవి శశి దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఉప్పు కప్పురంబు ఓటీటీ రిలీజ్ కానుంది. మరి ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, డేట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మహానటి కీర్తి సురేశ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. టాలీవుడ్‌లో యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరోగా సుహాస్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి కీర్తి సురేశ్, సుహాస్ కలిసి నటించిన సినిమా ఒకటి ఉంది. అయితే, అది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

కీర్తి సురేశ్-సుహాస్‌తోపాటు
ఆ మూవీనే ఉప్పు కప్పురంబు. కీర్తి సురేశ్, సుహాస్ తొలిసారిగా కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాను ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. ఈ మూవీకి ఐవి శశి దర్శకత్వం వహించారు. ఉప్పు కప్పురంబు సినిమాలో కీర్తి సురేశ్, సుహాస్‌తోపాటు బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు.
సెటైరికల్ కామెడీ చిత్రం
వసంత్ మారింగంటి రచించిన ఉప్పు కప్పురంబు సినిమా 1990ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది. దక్షిణ భారతదేశంలోని లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలోని ప్రజలు, వారి ఖనన (అంత్యక్రియలు) మౌలిక సదుపాయాలపై సెటైరికల్‌గా ఉప్పు కప్పురంబు సినిమాను రూపొందించారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అమెజాన్ ప్రైమ్లో ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు ఓటీటీ రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 4 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది.
240కిపైగా దేశాల్లో
కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240కిపైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రైమ్ వీడియోలో స్పెషల్‌గా ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (జూన్ 16) అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.
పాతుకుపోయిన కథలను
"ప్రైమ్ వీడియోలో మేము కథ చెప్పే మా పరిధిని విస్తృతం చేయడానికి, విస్తృత శ్రేణి ప్రేక్షకులు ఆకట్టుకునేందుకు, సాంస్కృతికంగా పాతుకుపోయిన వైవిధ్యమైన కథనాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ అండ్ ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ తెలిపారు.
ఆలోచింపజేసే
"ఉప్పు కప్పురంబు అనేది ఆలోచింపజేసే, ఆహ్లాదకరమైన, విచిత్రమైన సెటైరికల్ చిత్రం. ఇది ప్రామాణికమైన గ్రామీణ వాతావరణ సారాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో ఒక అసాధారణమైన ఇతివృత్తాన్ని తెరపైకి తెస్తుంది. ఎల్లనార్ ఫిల్మ్స్‌తో కలిసి పనిచేయడం, కీర్తి సురేశ్, సుహాస్ వంటి ప్రతిభావంతులైన తారాగణంతో పాటు ఐవి. శశి ప్రత్యేకమైన దృష్టిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తీసుకెళ్లడం మాకు గర్వకారణం" అని ఆయన పేర్కొన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



