మంచి సినిమాను 30 లక్షల్లో తీయొచ్చు కానీ జనాల్లోకి తేవాలంటే కోట్లు కావాలి- హీరో నాని బెట్‌పై నిలవే డైరెక్టర్ కామెంట్స్

ఇవాళ (ఫిబ్రవరి 14) థియేటర్లలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా నిలవే. సౌమిత్ పోలాడి హీరోగా, శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు సాయి కె వెన్నం దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సాయి కె వెన్నం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 13, 2026, 12:31:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌమిత్ రావు హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి డైరెక్ట్ చేసిన సినిమా నిలవే. తెలుగులో రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన నిలవే సినిమాతో శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జోడీగా సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

మంచి సినిమాను 30 లక్షల్లో తీయొచ్చు కానీ జనాల్లోకి తేవాలంటే కోట్లు కావాలి- హీరో నాని బెట్‌పై నిలవే డైరెక్టర్  కామెంట్స్
మంచి సినిమాను 30 లక్షల్లో తీయొచ్చు కానీ జనాల్లోకి తేవాలంటే కోట్లు కావాలి- హీరో నాని బెట్‌పై నిలవే డైరెక్టర్ కామెంట్స్

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా

పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం నిర్మించిన నిలవే సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఇవాళ (ఫిబ్రవరి 13) థియేటర్లలో విడుదల అయింది.

డైరెక్టర్ సాయి కె వెన్నం కామెంట్స్

అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి కె వెన్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ దర్శకుడు అన్నారు

చిత్ర దర్శకుడు సాయి కె వెన్నం మాట్లాడుతూ.. "30 లక్షల్లో మంచి సినిమా తీయవచ్చు. కానీ, జనాల్లోకి తేవాలంటే మాత్రం కోట్లు ఖర్చుపెట్టాలని ఆ మధ్య ఓ దర్శకుడు అన్నారు. మాది కంటెంట్ సినిమా. ప్రేక్షకులకు మంచి బిలీవ్ నేను ఇవ్వగలిగాను" అని అన్నారు.

మా దగ్గర బెట్‌లు లేవు కానీ..

"హీరో నాని గారు కోర్ట్ సినిమా తీశాక చూడండి.. నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్ కూడా వేశారు. కానీ, మా దగ్గర అలాంటి బెట్‌లు లేవు. మా దగ్గర మంచి సినిమా ఉంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి" అని నాని బెట్‌పై డైరెక్టర్ సాయి కె వెన్నం మాట్లాడారు.

సందీప్ రెడ్డి వంగాను కలిసినప్పుడు

"ఇందులో అందరూ కొత్తవారు కావచ్చు. అందరి కృషితో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారిని కలిసినప్పుడు ‘ఇక్కడ ఎవరూ క్రిస్టోఫర్ నోలన్ లేరు.. మన సినిమాను మనమే నమ్మాలి. నాకది వర్క్‌వుట్ అయింది. నువ్వు కూడా అదే నమ్ము’ అని చెప్పిన మాట నాలో స్ఫూర్తిని నింపింది’ అని సాయి కె వెన్నం చెప్పారు.

నటీనటుల కామెంట్స్

ఇకపోతే ఈ కార్యక్రమంలో నిర్మాత మాధురి, నటి సత్య శ్రీ, ఆర్ అండ్ ఎ ట్రావెల్స్ అనురాధా, ప్రవీణ కడియాల, ప్రొడ్యూసర్ గిరిధర్ రావు, నటుడు రూపేష్ తదితరులు మాట్లాడుతూ.. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన నిలవే చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారని వెల్లడించారు. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

నిలవే నటీనటులు

కాగా, నిలవే సినిమాలో సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలాతోపాటు రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుష్మిత తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More