Nilave Review: నిలవే రివ్యూ- సిచ్యువేషన్‌పై పొయెటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ- రొమాంటిక్ బీజీఎం- అర్జున్ రెడ్డిలా ఉందా?
Nilave Movie Review In Telugu: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ పొయెటిక్ లవ్ స్టోరీ సినిమా నిలవే. హీరో సౌమిత్ రావుతోపాటు సాయి కె వెన్నెం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నిలవే రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: నిలవే

నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు
నిర్మాణ సంస్థ: పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం
దర్శకత్వం: సౌమిత్ రావు, సాయి కె వెన్నం
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన తెలుగు పొయెటిక్ మ్యూజికల్ రొమాంటిక్ సినిమా ‘నిలవే’. ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పీవోవీ ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాహెర్ సినీ టెక్ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అందరూ కొత్తవాళ్లే కావడంతో ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ, నిలవే ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. చాలా మంది అర్జున్ రెడ్డి సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఇవాళ (ఫిబ్రవరి 13) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి నిలవే రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అర్జున్ (సౌమిత్ రావు) ఓ అనాథ. స్నేహితుడు(వైవా హర్ష) ఇంట్లో ఉంటూ ఓ యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. అతనికి తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనుకుంటాడు. కానీ, అర్జున్ జీవితంలోకి ఏ అమ్మాయి రాదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.
ఫ్లాట్‌లో ఊరి వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో నుంచి ఒక అందమైన అమ్మాయి అతిథి(శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. తొలి చూపులోనే అతిథిని ప్రేమిస్తాడు అర్జున్. పరిచయం పెంచుకొని దగ్గర అవుతాడు. అతిథి కూడా అర్జున్‌తో ఫిజికల్‌గా దగ్గరవుతుంది. కానీ, ప్రేమను మాత్రం అంగీకరించదు.
అతిథి ప్రేమకు ఒప్పుకోకపోవడానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్‌బ్యాక్ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి అర్జున్ మధ్య ఉన్న సిచ్చువేషన్‌షిప్ ఏంటీ? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్‌లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్, అతిథిలు ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే నిలవే చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. జెన్‌జీ యూత్‌కు కనెక్ట్ అయ్యే చిత్రం అని చెప్పొచ్చు. సిచ్చువేషన్‌షిప్ కాన్సెప్ట్‌కు సంగీతాన్ని ముడిపెడుతూ బ్యూటిఫుల్ పొయెటిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా నిలవేను మలిచారు డైరెక్టర్స్ సౌమిత్ రావు, సాయి వెన్నం.
హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో చాలా ఆసక్తికరంగా ప్రారంభమైన సినిమాలో ఒంటరితనం మనిషిని ఎలా కుంగదీస్తుంది అనే విషయాన్ని అర్జున్ పాత్రతో చూపించారు. తోడు కోసం వెతికే క్రమంలో ఎదురుదెబ్బలు తగలడం.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది.
అప్పటి నుంచి కథనం రొమాంటిక్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. అర్జున్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. అతిథి ప్రేమపై వెనకడుగు వేయడంతో.. ప్లాష్‌బ్యాక్‌లో ఏదో ఒక స్టోరీ ఉందనే విషయం ఊహించొచ్చు. అయితే అదేంటనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
ట్విస్టులు
ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఇక ద్వితియార్థం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. అతిథి ప్లాష్‌బ్యాక్ స్టోరీ గుండెను బరువెక్కిస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై అంచనాలు లేవు కానీ థియేటర్స్‌కి వెళ్లి చూసిన వారికి మాత్రం మ్యూజికల్‌గా మంచి అనుభూతిని అందిస్తుసింది.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులంతా కొత్తవారే. అయినప్పటికీ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. అర్జున్ పాత్రకు సౌమిత్ రావు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్ ఇరగదీశాడు. ఎమోషనల్ సన్నివేశాలలో చాలా బాగా నటించాడు.
ఇక అతిథిగా శ్రేయాసి సేన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా నటనతో మెప్పించింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.
రొమాంటిక్‌గా బీజీఎమ్
సాంకేతికంగా సినిమా బాగుంది. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. బీజీఎమ్ చాలా రొమాంటిక్‌గా ఆకట్టుకుంటుంది. సీన్స్‌కు తగినట్లుగా బీజీఎమ్ ఆ మూడ్ వచ్చేలా చేసింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే?
సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే మ్యూజికల్‌గా ఆకట్టుకునే బ్యూటిపుల్ పొయెటిక్ లవ్ స్టోరీ నిలవే.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


