Peddi OTT: ఓటీటీలోకి రామ్ చరణ్ పెద్ది- మొనగాడు మాత్రం మారండటూ నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ ప్రకటన- ఇంకెన్ని రోజుల్లో అంటే?
Peddi OTT Release Date Official: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా తాజాగా ప్రకటించింది. మరి పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇంకెన్ని రోజుల సమయం ఉందో లుక్కేద్దాం.
Peddi OTT Streaming Date Official: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకుంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

పెద్ది ఓటీటీపై అధికారిక ప్రకటన
నెల రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన పెద్ది ఓటీటీ స్క్రీన్స్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాను మిస్ అయిన ప్రేక్షకుల కోసం సదరు పెద్ది ఓటీటీ సంస్థ సరికొత్త అప్‌డేట్ ఇచ్చింది.
ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) పెద్ది సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. జూలై 9న నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ది ఓటీటీ రిలీజ్ కానుందని సంస్థ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
మొనగాడు మాత్రం మారడంటూ
"ఆట మారొచ్చు కానీ, మొనగాడు మాత్రం మారడు" అని ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్టర్‌ను పంచుకుంటూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రాసుకొచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ వంటి 4 భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. పెద్ది హిందీ వెర్షన్‌ను కూడా చాలా త్వరలోనే ఇదే ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.
సరికొత్త కోణంలో స్పోర్ట్స్ డ్రామా
ఈ సినిమా కథాంశం ఒక ఆట కూలీ చుట్టూ తిరుగుతుంది. డబ్బు కోసమే ఏ జట్టుకైనా ఆడే ఒక ఆటగాడి జీవితం.. అప్పలాసూరి అనే గ్రామీణ వ్యక్తిని కలిసిన తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది అనేది పెద్ది ముఖ్యాంశం. తమ గ్రామానికి రైల్వే హాల్ట్, అధికారిక గుర్తింపు తీసుకురావడం కోసం అప్పలాసూరి కొన్నేళ్లుగా ఒంటరి పోరాటం చేస్తుంటాడు.
తన గురువు గౌరినాయుడు పర్యవేక్షణలో, పెహల్వానీ నైపుణ్యాలను ఉపయోగించి ఆ క్రికెటర్ కేవలం డబ్బు కోసం ఆడే స్థాయి నుంచి ఇతరుల కోసం త్యాగాలు చేసే నిజమైన క్రీడాకారుడిగా ఎలా మారాడనే కథతో 'పెద్ది' సాగుతుంది. పల్లెటూరి వాతావరణాన్ని, ఎమోషన్స్‌ను బుచ్చిబాబు సాన తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది.
భారీ తారాగణం.. రికార్డ్ కలెక్షన్లు
ఈ సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ లతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, రవి కిషన్, విజి చంద్రశేఖర్, సత్య, అజయ్ ఘోష్ వంటి భారీ తారాగణం పెద్దిలో కీలక పాత్రలు పోషించారు.
ప్రముఖ ట్రేడ్ సంస్థ శాక్‌నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం, పెద్ది చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 338.98 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఒక్క భారతదేశంలోనే 1,20,447 షోల ద్వారా రూ. 242.03 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


