Peddi OTT Release Date: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్రేజీ బజ్.. మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ చేస్తున్న మేకర్స్.. ఎక్కడంటే?
Peddi OTT Release Date: రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో జులై 2 లేదా 16న రానుందని సమాచారం.
Peddi OTT Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది.

ఇప్పటికే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటి, రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ఒక పక్క థియేటర్లలో రన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండగానే.. మరోపక్క ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ ఓటీటీ ఎంట్రీ.. ఆ రోజేనా?
'పెద్ది' సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో సినిమా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండటంతో పాటు, చిత్రంలోని వీడియో సాంగ్స్ అన్నీ యూట్యూబ్‌లో రిలీజ్ కావడంతో ఓటీటీ ప్రీమియర్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. 'పెద్ది' మూవీ వచ్చే నెల అంటే జులై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని గట్టిగా ప్రచారం సాగుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనుందని తెలుస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే జులై 16 రానుందని కూడా మరో వార్త వస్తోంది.
మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్
మరోవైపు పెద్ది సక్సెస్ తో మేకర్స్ మరో మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ మంగళవారం (జూన్ 23) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ వార్త రామ్ చరణ్ అభిమానుల్లో ఎక్కడ లేని ఆనందాన్ని నింపింది. ఈ ఈవెంట్ కోసం చెర్రీ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.
పక్కా రూరల్ డ్రామా.. బుచ్చిబాబు మార్క్ మ్యాజిక్
'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ నటించిన పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావడంతో మొదటి నుంచి 'పెద్ది'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను డైరెక్టర్ బుచ్చిబాబు సానా వంద శాతం రీచ్ అయ్యారు. విజయనగరం నేపథ్యంలో సాగే కుస్తీ (రెజ్లింగ్) క్రీడ చుట్టూ తిరిగే ఎమోషనల్ కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
రామ్ చరణ్ తన రగ్గడ్ లుక్, ఊర మాస్ యాక్టింగ్‌తో థియేటర్లలో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. ‘దేవర’ సినిమా తర్వాత బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో నటించిన రెండో సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో ఆమె ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్రలో ఒదిగిపోయింది.
పెద్ది విశేషాలు
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకూమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటులు బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, రవికిషన్ కీలక పాత్రల్లో నటించారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రత్నవేలు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. థియేటర్లలో రూ. 400 కోట్లతో ప్రభంజనం సృష్టించిన ఈ రూరల్ స్పోర్ట్స్ విజువల్ వండర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


