Ram Charan: జాన్వీ కపూర్ సీన్ల వివాదం- బుచ్చిబాబుతో పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్- హీరోల బాధ్యత లేదా అంటూ ప్రశ్నలు!

Ram Charan Buchi Babu Watch Peddi Movie On Sunday: పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌తో చేసిన సీన్లపై వివాదం తీవ్రంగా నడుస్తోంది. ఈ క్రమంలో హైదారాబాద్‌లో జూన్ 7న డైరెక్టర్ బుచ్చిబాబు సానతో కలిసి రామ్ చరణ్ పెద్ది సినిమాను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 8, 2026, 12:00:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan Buchi Babu Watch Peddi Movie On Sunday: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది'. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసింది.

జాన్వీ కపూర్ సీన్ల వివాదం- బుచ్చిబాబుతో పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్- హీరోల బాధ్యత లేదా అంటూ ప్రశ్నలు!
జాన్వీ కపూర్ సీన్ల వివాదం- బుచ్చిబాబుతో పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్- హీరోల బాధ్యత లేదా అంటూ ప్రశ్నలు!

జూన్ 4న విడుదలై

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పెద్ది సినిమాలో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 4న థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో అదరగొడుతోంది.

మంచి టాక్‌తో దూసుకుపోతున్న పెద్దికి జాన్వీ కపూర్‌ను మితిమీరిన స్కిన్ షో సీన్స్ సెక్సువలైజ్డ్‌గా అభివర్ణిస్తూ పెద్ద వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం (జూన్ 8) నాడు రామ్ చరణ్ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు వచ్చి అభిమానులతో కలిసి పెద్ది సినిమా చూశారు.

బుచ్చిబాబుతో కలిసి

సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ ఇలా బహిరంగంగా థియేటర్ లోపల కనిపించడం ఇదే మొదటిసారి. దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాత వెంకట సతీష్ కిలారుతో కలిసి రామ్ చరణ్ పెద్ది సినిమాను వీక్షించారు. పెద్ది థియేటర్‌లోని హౌస్‌ఫుల్ షో ఎనర్జీని ప్రత్యక్షంగా ఆస్వాదించారు. అయితే, ఈ థియేటర్ విజిట్‌కు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో హీరోల బాధ్యతపై సరికొత్త చర్చ మొదలైంది.

థియేటర్లలో చరణ్ సందడి.. నెట్టింట భిన్న స్వరాలు

పెద్ది సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో రామ్ చరణ్ కాసేపు ముచ్చటించారు. రామ్ చరణ్ రాకతో థియేటర్ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఒకవైపు ఈ వీడియోలు చరణ్ అభిమానులను ఖుషీ చేస్తుంటే, మరోవైపు నెటిజన్లు మాత్రం ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదాలను ప్రస్తావిస్తూ చెర్రీని ప్రశ్నిస్తున్నారు.

పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను మితిమీరిన గ్లామర్‌తో చూపించారనే విమర్శలు వస్తున్న సమయంలో, హీరో ఇలా సంబరాలు చేసుకోవడం ఆ విమర్శలను పట్టించుకోకపోవడమే అవుతుందని కొందరు వాదిస్తున్నారు.

హీరోల బాధ్యత ఏది? నెటిజన్ల సూటి ప్రశ్నలు

ఈ సినిమాలో మహిళా పాత్రను తక్కువ చేసి చూపించినప్పుడు కేవలం హీరోయిన్‌నే ఎందుకు తప్పుబడుతున్నారు, హీరోల బాధ్యత లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు.

"ఇలాంటి అభ్యంతరకరమైన, మహిళలను కించపరిచే డైలాగులు చెప్పినందుకు రామ్ చరణ్‌ను ఎందుకు ఎవరూ బాధ్యుడిని చేయడం లేదు? జాన్వీ కపూర్‌ను టార్గెట్ చేసినంతగా చరణ్‌ను ఎందుకు విమర్శించడం లేదు?" అని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. మరొక నెటిజన్ సినిమా పరిశ్రమలో ఉన్న పాత ధోరణిని ఎండగడుతూ సుదీర్ఘ నోట్ రాసుకొచ్చారు.

హీరోయిన్లనే టార్గెట్ చేయడం

"ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఎప్పుడూ నటీమణులనే టార్గెట్ చేయడం అలవాటుగా మారింది. 'యానిమల్' సినిమాలో బోల్డ్ సీన్స్ చేసినందుకు తృప్తి డిమ్రీని తీవ్రంగా విమర్శించారు కానీ రణబీర్ కపూర్‌ను ఏమీ అనలేదు. ఒక ప్రైవేట్ పాట విషయంలో నోరా ఫతేహిని తప్పుపట్టారు కానీ సంజయ్ దత్‌ను వదిలేశారు" అని రాసుకొచ్చారు.

"ఇప్పుడు జాన్వీ విషయంలోనూ అదే జరుగుతోంది. తప్పు పట్టాలనుకుంటే స్క్రిప్ట్ రాసిన రచయితను, దర్శకుడిని, హీరో రామ్ చరణ్‌ను కూడా సమానంగా తప్పుపట్టాలి" అని సదరు యూజర్ పేర్కొన్నారు.

నెట్టింట రామ్ చరణ్‌ను కూడా ఈ వివాదంలోకి లాగుతూ నెగెటివ్ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More