వందేమాతరం పాడనన్న ఏఆర్ రెహమాన్- సమర్ధించిన సింగర్ చిన్మయి, బంగారం హీరోయిన్ మీరా చోప్రా- ప్రియాంక చోప్రాతో పోలుస్తూ!
హిందీ చిత్రసీమలో తనకు పని తగ్గడంపై ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే రెహమాన్ వందేమాతరం పాడకపోవడంపై సింగర్ చిన్మయి, పవన్ కల్యాణ్ బంగారం హీరోయిన్ మీరా చోప్రా మద్దతుగా నిలిచారు. వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రాను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మీరా చోప్రా.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. గత ఎనిమిదేళ్లుగా హిందీలో తనకు అవకాశాలు తగ్గడానికి కారణం అక్కడ జరిగిన 'అధికార మార్పిడి' కావొచ్చని, అది కొంత మతపరమైన అంశం కూడా అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

రెహమాన్ దేశభక్తిని శంకించవద్దు
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుండగా, రెహమాన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని పాత ఆరోపణలను సింగర్ చిన్మయి శ్రీపాద తోసిపుచ్చారు. ఓ జర్నలిస్ట్ ఎక్స్‌లో (ట్విట్టర్) స్పందిస్తూ.. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను అరగంట పాటు బతిమిలాడిన రెహమాన్ ‘వందేమాతరం’ లేదా ‘మా తుఝే సలామ్’ పాడటానికి నిరాకరించారని, అది తనను చాలా బాధించిందని పేర్కొన్నారు.
దీనిపై సింగర్ చిన్మయి స్పందిస్తూ.. "గతేడాది నవంబర్ 23, 2025న పుణేలో జరిగిన ఆర్కే లక్ష్మణ్ మెమోరియల్ అవార్డ్ కాన్సర్ట్‌లో రెహమాన్ గారితో కలిసి మేమందరం వందేమాతరం పాడాము. అక్కడ ఉన్న వేలాది మంది జనం మాతో కలిసి గొంతు కలిపారు" అని గుర్తు చేశారు.
గొంతు సహకరించకపోయి ఉండొచ్చు
దాదాపు ప్రతి కాన్సర్ట్‌లోనూ ఆయన ‘మా తుఝే సలామ్’ పాడతారని, ఆ రోజు ఇంటర్వ్యూలో ఆయన గొంతు సహకరించకపోయి ఉండొచ్చు లేదా పాడాలనిపించి ఉండకపోవచ్చని, అంతమాత్రాన దానికి తప్పుడు అర్థాలు తీయడం సరికాదని చిన్మయి హితవు పలికారు.
ఈ చిన్న విషయాన్ని పట్టుకుని 'అందుకే ఆయన అలా చేశారు' అంటూ ముగింపులు పలకడం నేటి సమాజంలో ఉన్న విద్వేషపూరిత ధోరణికి అద్దం పడుతోందని సింగర్ చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రియాంక చోప్రాతో పోల్చిన మీరా చోప్రా
రెహమాన్ సంగీతం అందించిన ‘గాంధీ టాక్స్’ చిత్రంలో నటిస్తున్న మీరా చోప్రా కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. తన కజిన్ సిస్టర్ ప్రియాంక చోప్రాతో రెహమాన్‌ను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"భారతదేశాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన వ్యక్తులు ఇద్దరే.. ఒకరు ప్రియాంక చోప్రా, మరొకరు ఏఆర్ రెహమాన్. ఆయన ఉద్దేశం అది కాకపోయినా, కావాలని ట్రోల్ చేయడం సిగ్గుచేటు. ఐకానిక్ ‘వందేమాతరం’ గీతాన్ని మనకు అందించిన ఆ లెజెండ్‌ను గౌరవించడం నేర్చుకోండి" అని పవన్ కల్యాణ్ బంగారం హీరోయిన్ మీరా చోప్రా పేర్కొన్నారు.
వివాదానికి కారణమైన వ్యాఖ్యలేంటి?
బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ముస్లిం మతానికి సంబంధించిన పదాలను సినిమాల్లో వాడే తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
"ఏదైనా చెడు జరిగినప్పుడు పాత్రలు ‘సుభానల్లా’, ‘అల్హందులిల్లా’ అని అనడం క్లీషేగా, ఇబ్బందికరంగా (Cringe) ఉంది. ‘ఛావా’ వంటి సినిమాలు విభజన రాజకీయాలపై ఆధారపడి లాభపడుతున్నాయి" అని ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వాడివేడి చర్చకు కారణమయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


