ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. చాలా కష్టాలు అనుభవించాను.. మా నాన్న మూడు ఉద్యోగాలు చేసేవారు: ఏఆర్ రెహమాన్ కామెంట్స్

ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన బాల్యం, అప్పట్లో తన కుటుంబం పడిన కష్టాల గురించి చెప్పాడు. నిఖిల్ కామత్ ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

Nov 21, 2025, 17:24:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ కంపోజర్, ఆస్కార్ విజేత ఏ.ఆర్‌. రెహమాన్ ఎన్నో బాధలు అనుభవించిన తన బాల్యం గురించి తరచుగా మాట్లాడుతుంటాడు. ఇటీవల నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఆ కష్టాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చాలా చిన్న వయస్సులోనే ప్రతి రోజు బాధాకరమైన సంఘటనలను చూశానని రెహమాన్ తెలిపాడు. తమ కుటుంబానికి ఒక ఆశ్రయం కల్పించడానికి తండ్రి ఒకేసారి మూడు ఉద్యోగాలు చేశారని అతడు గుర్తు చేసుకున్నాడు.

ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. చాలా కష్టాలు అనుభవించాను.. మా నాన్న మూడు ఉద్యోగాలు చేసేవారు: ఏఆర్ రెహమాన్ కామెంట్స్
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. చాలా కష్టాలు అనుభవించాను.. మా నాన్న మూడు ఉద్యోగాలు చేసేవారు: ఏఆర్ రెహమాన్ కామెంట్స్

చిన్నతనం నుంచి కష్టాలే

సంగీతాన్ని కొనసాగించడానికి తన తల్లి తనను బాగా ప్రోత్సహించిందని ఏఆర్ రెహమాన్ చెప్పాడు. తన తండ్రి తన తొమ్మిదేళ్ల వయసులోనే చనిపోయిన తరువాత కుటుంబాన్ని పోషించే బాధ్యతను తాను తీసుకున్నట్లు తెలిపాడు. తన బాల్యంలో ఎక్కువ భాగం 40, 50 ఏళ్ల సంగీతకారులతో స్టూడియోలలో గడిచిందని రెహమాన్ పంచుకున్నాడు. ఈ కారణంగా స్కూల్ జీవితాన్ని, స్నేహితులతో గడపడాన్ని తాను ఆస్వాదించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

"నేను పెరిగే క్రమంలో నా తండ్రి, అమ్మమ్మ మరణాలు వంటి చాలా విషయాలు చూశాను. ఇది జరిగినప్పుడు నాకు కేవలం తొమ్మిదేళ్లు. ప్రతి రోజు నేను చాలా బాధలు చూశాను" అని అతడు వెల్లడించాడు.

"మా అమ్మ ఒంటరి తల్లి. ఆమె చాలా ధైర్యం ఉన్న మహిళ. నా తల్లి అన్ని బాధలను తట్టుకుంది. మమ్మల్ని రక్షించడానికి ఆమె ఎంతో కష్టపడింది. ఆమె అన్ని రకాల అవమానాలను తట్టుకుని ఒంటరిగా మమ్మల్ని పెంచిన చాలా బలమైన మహిళ" అని రెహమాన్ చెప్పాడు.

తండ్రి గురించి ఏం చెప్పాడంటే?

"నేను నా జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలోనే గడిపాను. నేను అక్కడే పుట్టాను. మా నాన్న స్టూడియోలలో పని చేసేవారు. కోడంబాక్కం దగ్గర స్టూడియోలు ఉండే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం" అని రెహమాన్ వివరించాడు.

"వాళ్ల కుటుంబ సభ్యులు మా అమ్మానాన్నలను వీధిలో పడేశారు. ఆయన అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. మాకు ఆ ఇంటిని ఇవ్వడానికి ఆయన రాత్రింబవళ్లు పనిచేశారు. ఒకేసారి మూడు ఉద్యోగాలు చేయడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అదే నా బాల్యంలో చీకటి కోణం. ఆ ట్రామా నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని తెలిపాడు.

రెహమాన్ లేటెస్ట్ మూవీస్

ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రాబోతున్న 'తేరే ఇష్క్ మే' సినిమాకు మ్యూజిక్ అందించాడు. దీనికి అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది.

దీంతోపాటు రామ్ చరణ్ పెద్ది మూవీకి కూడా అతడు మ్యూజిక్ అందిస్తున్నాడు. రెహమాన్ నవంబర్ 23న పూణేలోని MCA స్టేడియంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఈవెంట్‌లో ఆమిర్ ఖాన్, బోనీ కపూర్, సుఖ్వీందర్ సింగ్, చిన్మయి, హరిహరన్ వంటి ప్రముఖులు పాల్గొంటారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More