ధనుష్ సర్ పేరును తప్పుగా వాడుతున్నారని అన్నాను.. నా కామెంట్స్‌ను పూర్తిగా మార్చేశారు.. ఆ ఛానెల్స్ వల్లే: నటి మాన్యా
ధనుష్ మేనేజర్ శ్రేయస్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన నటి మాన్యా ఆనంద్ ఇప్పుడు మాట మార్చింది. ఎవరో వ్యక్తి ధనుష్ సర్ పేరును తప్పుగా వాడుతున్నాడని తాను చేసిన కామెంట్స్ ను పూర్తిగా మార్చేసి ఆరోపణలుగా చిత్రీకరించారని ఆమె అనడం గమనార్హం.
తమిళ నటి మాన్య ఆనంద్, నటుడు ధనుష్ మేనేజర్ శ్రేయస్ చుట్టూ తిరుగుతున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. వీటిపై శ్రేయస్ క్లారిటీ ఇవ్వగా.. అటు మాన్య కూడా మాట మార్చింది. ఎవరో నకిలీ వ్యక్తి ధనుష్ పేరును దుర్వినియోగం చేస్తున్నారనే తాను చెప్పానని, కానీ అవి కాస్తా ధనుష్, అతని మేనేజర్ పై ఆరోపణలుగా మారాయని ఆమె అనడం గమనార్హం.

అదంతా తప్పుడు సమాచారం
'వనతై పోల' అనే టీవీ షో ద్వారా గుర్తింపు పొందిన నటి మాన్య ఆనంద్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధనుష్ మేనేజర్ శ్రేయస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసినట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ వివాదంపై స్పందిస్తూ.. మాన్య, ధనుష్ మేనేజర్ శ్రేయస్ బుధవారం (నవంబర్ 18) సాయంత్రం సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేశారు.
మాన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. వీడియోను ఇష్టానుసారం కట్ చేసి, ధనుష్ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు పూర్తి 'సినివులగం' ఇంటర్వ్యూను చూడాలని ఆమె ప్రేక్షకులను కోరింది.
తరువాత ఆమె ఒక వీడియో స్టేట్‌మెంట్‌ను కూడా విడుదల చేసింది. "నేను ఇటీవల కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలోని వీడియో వైరల్ అయింది. 'మాన్య ఆనంద్ ధనుష్ మేనేజర్‌పై ఆరోపణలు చేసింది' అని ప్రచారం చేస్తున్నారు. నేను ఇటీవల సినివులగంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ సినిమా గురించి మాట్లాడటానికి నాకు ఎవరో నకిలీ వ్యక్తి కాల్ చేశారని, అది నకిలీ కాల్ కావచ్చునని, ఆ వ్యక్తి గురించి నాకు తెలియదని చెప్పాను. అది నకిలీదా లేక నిజమా అని నాకు తెలియదని నేను చాలా స్పష్టంగా చెప్పాను" అని మాన్య తెలిపింది.
ధనుష్ పేరు దుర్వినియోగం
మాన్య తాను ఇంటర్వ్యూలో ధనుష్ పేరును దుర్వినియోగం చేస్తున్నారని మాత్రమే చెప్పానని, కానీ తన ప్రకటనను వక్రీకరించారని తెలిపింది. "ధనుష్ సర్ పేరును దుర్వినియోగం చేస్తున్నారని నేను చెప్పాను. నేను అందించిన ఫుటేజ్ ఒక అవగాహన వీడియో. కానీ అది ఇప్పుడు దుర్వినియోగం అవుతోంది.
ఆ అవగాహన వీడియో ఇప్పుడు ఆరోపణ వీడియోగా మారింది. నా పేరును ఉపయోగించి మరొకరిని అపఖ్యాతి పాలు చేయడం బాధాకరం. యూట్యూబ్ ఛానెల్స్ వారి వ్యూస్ కోసం తప్పుగా వీడియోలను ఎడిట్ చేస్తున్నాయి" అని నటి ఆవేదన వ్యక్తం చేసింది. మాన్య తన ఇంటర్వ్యూలో శ్రేయస్ అని చెప్పుకున్న ఒక వ్యక్తి ధనుష్ సినిమాలో పాత్ర కోసం 'కమిట్‌మెంట్' ఇవ్వాలని కోరాడని, వండర్‌బార్ ఫిల్మ్స్‌లో కలవమని కూడా అడిగాడని పేర్కొంది.
ధనుష్ మేనేజర్ శ్రేయస్ ప్రకటన
ధనుష్ మేనేజర్ శ్రేయస్ కూడా తన సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. "నేను ఇప్పటికే జనవరి 31, 2024 నాడు, మళ్లీ ఫిబ్రవరి 19, 2025 నాడు నా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో స్పష్టం చేసినట్లుగా.. నా పేరు మీద లేదా వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద వచ్చే ఏవైనా కాస్టింగ్ కాల్స్, మెసేజ్‌లు లేదా ఆఫర్‌లు పూర్తిగా నకిలీవి, నిరాధారమైనవి అని నేను మరోసారి చెబుతున్నాను" అని శ్రేయస్ అన్నాడు. తన పేరిట వాడుతున్న రెండు మొబైల్ నంబర్స్ ను కూడా అతడు ఇచ్చాడు. అవి తన నంబర్లు కావని, పోలీసులకు ఇప్పటికే ఈ విషయంలో ఫిర్యాదు చేశానని తెలిపాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


