Peddi: డైరెక్టర్ హద్దులు దాటారు, కలెక్షన్స్ కోసమే అలా.. పెద్దిలో అసభ్యకర సీన్లపై జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్
Janhvi Kapoor Makeup Artist On Peddi Controversy Scenes: రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై, సీన్లు, కెమెరా యాంగిల్స్‌పై హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జాన్వీ ముందే అభ్యంతరం చెప్పినా దర్శకుడు హద్దులు దాటారంటూ తెలిపారు.
Janhvi Kapoor Makeup Artist On Peddi Controversy Scenes: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' జూన్ 4న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అయితే కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా చుట్టూ ఒక పెద్ద వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.

అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్
హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను మితిమీరిన గ్లామర్‌తో, కొన్ని అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌తో చూపించారంటూ ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మన్‌చందా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ టాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.
జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలిచిన సావ్లీన్ కౌర్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. సినిమా నిర్మాణానంతర పనుల (పోస్ట్ ప్రొడక్షన్) సమయంలోనే కొన్ని వివాదాస్పద షాట్లపై జాన్వీ కపూర్ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
"సినిమాలో హీరోయిన్ ఎంచుకున్న పాత్రను బట్టి ఆమెను తప్పుబట్టడం చాలా సులువు. కానీ, ఇక్కడి కథ వేరేలా ఉంది. పరిశ్రమలో మహిళలను కేవలం గ్లామర్ వస్తువుగా మార్చే అలవాటుపై జాన్వీ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఆమె ఆ సీన్లపై స్పష్టమైన అభ్యంతరం వ్యక్తం చేసింది" అని సదరు పోస్ట్‌లో రాశారు.
డైరెక్టర్ హద్దులు దాటారా? రామ్ చరణ్ మద్దతు!
జాన్వీ కపూర్ ప్రొఫెషనల్‌గా కొన్ని హద్దులు గీసినప్పటికీ, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం దర్శకుడు ఆమె సమ్మతిని పక్కనబెట్టి, హద్దులు దాటి ఫైనల్ ఎడిటింగ్‌లో ఆ సీన్లను అలాగే ఉంచేశారని ఆ పోస్ట్‌లో సావ్లీన్ కౌర్ ఆరోపించారు. ఇది నటి తప్పు కాదని, దర్శకుడి ఎంపికేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, జాన్వీ కపూర్ తన ఫ్యాన్ క్లబ్స్‌కు పంపినట్లు చెబుతున్న కొన్ని చాటింగ్ స్క్రీన్‌షాట్లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 30 నాటి ఒక చాట్‌లో జాన్వీ ఈ కెమెరా యాంగిల్స్ గురించి ప్రస్తావించారు.
"నా శరీర భాగాలను క్లోజప్‌లో చూపించవద్దని నేను డైరెక్టర్‌కు ముందే చెప్పాను. హీరో రామ్ చరణ్ సర్ కూడా నా వైపు నిలబడి, అలాంటి యాంగిల్స్ మళ్లీ తీయవద్దని డైరెక్టర్‌తో అన్నారు. దాంతో డైరెక్టర్ అప్సెట్ అయ్యారు" అని జాన్వీ ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదంపై జాన్వీ ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అసలు వివాదానికి కారణమైన సీన్లు ఏంటి?
పెద్ది సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్ సీన్‌పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. కథానాయిక వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కంటే ఆమె శరీరంపైనే కెమెరా ఎక్కువ ఫోకస్ పెట్టిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వీటితో పాటు, కరెంట్ పోయిన సమయంలో హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా, ఆమె సమ్మతి లేకుండా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకునే సన్నివేశం కూడా తీవ్ర వివాదానికి దారితీసింది.
తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
విమర్శలు ముదరడంతో దర్శకుడు బుచ్చిబాబు సాన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. "వెండితెరపైన, బయట కూడా నాకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ ఏ సీన్ అయినా మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసి ఉంటే, మీ సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ క్షమాపణలు చెబుతున్నాను. ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత, ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమాలో నుంచి తొలగించాలని లేదా మార్చాలని నిర్ణయించాము" అని బుచ్చిబాబు ప్రకటించారు.

ఈ వివాదాలు ఎలా ఉన్నా 'పెద్ది' బాక్సాఫీస్ రన్ మాత్రం అద్భుతంగా సాగుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు దేశీయంగా రూ. 150 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 236 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


